ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసు: కోర్టుకు రాహుల్ గాంధీ
ముంబై: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం మహారాష్ట్రలోని భీవండి కోర్టులో హాజరయ్యారు. 2014, మార్చి 6న సార్వత్రిక ఎన్నికల సమయంలో మహాత్మా గాంధీ హత్యతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు సంబంధం ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ అప్పట్లో రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది.
రాజేశ్ కుంతే అనే స్థానిక ఆరెస్సెస్ కార్యకర్త ఫిర్యాదు మేరకు ఈ కేసు ఫైల్ చేశారు. ఆరెస్సెస్ కూడా రాహుల్ తమ సంస్థపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.

నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో.. రాహుల్‌ను జూన్ 12వ తేదీన తమ ముందు హాజరవ్వల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం రాహుల్ ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత నేరుగా కోర్టు ముందు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications