ఆర్ఎస్ఎస్ ‘గ్రాండ్ ఇఫ్తార్ పార్టీ’కి షాకిచ్చిన సొంత విభాగం
ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముస్లింలకు ఇవ్వనున్న గ్రాండ్ ఇఫ్తార్ పార్టీకి సొంత విభాగమే షాకిచ్చింది. మలబార్హిల్స్లోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఆర్ఎస్ఎస్ గ్రాండ్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ విందుకు 30 దేశాల ముస్లిం ప్రముఖులు, 100 మంది స్వదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు.అయితే, ప్రభుత్వ అతిథి గృహంలో ఇఫ్తార్ విందు నిర్వహించొద్దని అర్ఎస్ఎస్ ముస్లిం విభాగం(ముస్లిం రాష్ట్రీయ మంచ్) కార్యకర్తలు అదిల్ ఖత్రీ, షకీల్ అహ్మద్ షేక్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

కాగా, 2015 జులై నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వల ప్రకారం.,. ప్రభుత్వ కార్యాలయాల్లో, అతిథి గృహాల్లో పబ్లిక్ మీటింగ్లు, ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించరాదు. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉత్తర్వులపై స్పందించాలని, ఆర్ఎస్ఎస్ ఇఫ్తార్ విందుని అడ్డుకోవాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యకర్తలు కోరారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications