ఆర్ఎస్ఎస్ న్యూలుక్: నెక్కర్ స్థానంలో బ్రౌన్ కలర్ ప్యాంట్లు

నాగౌర్‌: ఇకపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు నిక్కర్ల స్థానంలో గోధుమ రంగు ప్యాంట్లను ధరించనున్నారు. రాజస్థాన్ లోని నాగౌర్ లో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభ లో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజి జోషి పేర్కొన్నారు

ఇంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు వినగానే ఖాకీ నిక్కరు, తెల్లని షర్టు, నల్లని టోపీ, చేతిలో కర్ర.. ఈ ఆహార్యంలో ఉండే కార్యకర్తలే కళ్లముందు మెదిలేవారు. కాగా, దాదాపు 9దశాబ్దాలుగా ఉన్న ఈ నిక్కర్ల స్థానే తాజా ప్యాంట్లను ప్రవేశపెట్టనున్నారు.

RSS replaces traditional 'khaki shorts' with brown-coloured trousers

ప్రస్తుత యువతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రధానమైన మార్పును చేశారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభలో సంస్థ ఏకరూప దుస్తుల్లో మార్పుపై అంగీకారం కుదిరింది.

ఇక నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఖాకీ నిక్కరు స్థానే గోధుమవర్ణ(బ్రౌన్‌) ప్యాంట్లను ధరించాలని నిర్ణయించామని సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజి జోషి వెల్లడించారు.

ప్రత్యేకంగా ఈ రంగును ఎంపిక చేయటంలో ఆంతర్యం ఏమీ లేదన్నారు. చూడడానికి చక్కగా ఉండటంతో అందరూ గోధుమవర్ణానికి ఆమోద ముద్రవేశారని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+