కేరళలో మరో హత్య: నడిరోడ్డుపై ఆరెస్సెస్ కార్యకర్తను పొడిచి, చంపేశారు
సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో వరుసగా రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యారు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.
తిరువనంతపురం: సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో వరుసగా రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యారు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.
అరెస్సెస్ కార్యకర్త అయిన ఆనంద్‌పై ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ దాడి జరిగింది. బైక్ పైన వెళ్తున్న అతన్ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచారు.

గురువాయుర్‌లోని నెన్మిని వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగులు పలుమార్లు పొడవడంతో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.












Click it and Unblock the Notifications