గడ్కరీ సంచలనం: ఆర్టీఓలు బందిపోట్లను మించిపోయారు
న్యూఢిల్లీ: కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్టీఓ కార్యాలయాలంటే దేశంలోనే అత్యంత అవినీతకరమైనవి. చంబల్లోయ బందిపోట్ల కంటే భారీగా దోచుకుంటాయి' అని ఆయన పేర్కొన్నారు.
మొత్తం రవాణా రంగంలో సంస్కరణల్ని తీసుకువచ్చే నూతన మోటారు వాహన చట్ట అమల్లో జాప్యంపట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం దైనిక్ జాగరణ్‌కు చెందిన జాగరణ్ నిర్వహించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మీద అత్యంత అవినీతి జరిగేది రవాణాశాఖ కార్యాలయ్యాల్లోనేనని ఆయన మండిపడ్డారు. రవాణాశాఖాధికారులు చంబల్ లోయ బందిపోటు దొంగలను మించిపోయారన్నారు.

రవాణా రంగంలో పారదర్శకత, కంప్యూటరీకరణలను వ్యతిరేకిస్తున్న స్వార్ధశక్తులే నూతన బిల్లునూ వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. నియమాలను ఉల్లంఘించే వారికి రూ. 3 లక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్ష పడేందుకు ఈ కొత్త బిల్లు వీలు కల్పిస్తుందన్నారు.
రాష్ట్రాల్లో మంత్రులు ఈ బిల్లును వ్యతిరేకించేలా ఆర్టీఓ అధికారులు రెచ్చగోట్టారని చెప్పడానికి బాధపడుతున్నానని చెప్పారు. రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబడుతుందన వారు దుష్ర్షచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. భారత్‌లో డ్రైవింగ్ లైసెన్సు అంత సులభంగా లభించదన్నారు.
ఇందులో 30 శాతం డ్రైవింగ్ లైసెన్సులు నికిలీవేనని వెల్లడించారు. 'ఆర్టీఓ రాజ్'కు స్వస్తి పలికి పారదర్శకమైన, అవినీతి రహిత ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో ఈ-పాలన తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు.
రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చాలని భావిస్తున్నామన్నారు. ఈ బిల్లు కేంద్ర మంత్రి మండలి వద్ద ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉందన్నారు. ఈ బల్లు ద్వారా కొత్త వివాదాన్ని తీసుకువస్తున్నానని ప్రధాని మోడీ అంటున్నారు.
ఈ బిల్లుపై రాష్ట్రాల సమ్మితిని ప్రధాని మోడీ కోరారని తెలిపారు. దేశంలో ప్రతి ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుండగా, 3 లక్షల మంది క్షతగాత్రులవుతున్నారని ఆయన తెలిపారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications