4.5 కిలోమీటర్ల పొడవైన రైలును చూశారా..? ఇండియన్ రైల్వే రికార్డ్..
ఇలాంటి రైలు మీరెప్పుడూ చూసి ఉండరు. దేశంలోనే పొడవైన రైలు ఇదే కావడం విశేషం. ఈ రైలును భారతీయ రైల్వే అయిన తూర్పు మధ్య రైల్వేలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) డివిజన్‌లో నిర్మించింది. మొత్తం 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైలుకు 'రుద్రాస్త్ర' అని నామకరణం చేశారు. ఈ రైలు ఆగస్టు 7న పట్టాలపై పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ గూడ్స్ రైలు 6 ఖాళీ బాక్సన్ రేక్ లను ఒకేసారి తీసుకెళ్లింది. 354 వ్యాగన్లతో, 7 ఇంజిన్లతో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. తూర్పు మధ్య రైల్వేలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) డివిజన్ లోని గంజ్ కవాజా స్టేషన్ నుంచి ప్రారంభం అయింది ఈ రైలు. దీని పొడవు దాదాపు 4.5 కిలోమీటర్లు ఉంది. ఇప్పటివరకు భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత పొడవైన గూడ్స్ రైలు ఇదే కావడం విశేషం.

ఈ రుద్రాస్త్ర రైలు గంజ్ కవాజా రైల్వే స్టేషన్ నుంచి గర్హ్వా రోడ్ స్టేషన్ వరకు దాదాపు 200 కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల్లోనే చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ గూడ్స్ రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని స్పష్టం చేశారు. ఈ గూడ్స్ రైళ్లను వేర్వేరుగా నడిపితే.. వాటన్నింటికీ ఆరు వేర్వేరు మార్గాలు, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ రైళ్లను కలిపి నడపడం వల్ల సమయం ఆదా అయిందని అధికారులు పేర్కొన్నారు.ఇలాంటి సూపర్ లాంగ్ సరుకు రవాణా రైళ్ల నిర్వహణ భవిష్యత్తులో లాజిస్టిక్స్ వేగం, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
'Rudrastra' - Bharat's longest freight train (4.5 km long) pic.twitter.com/Ufk2MFnpfl
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 8, 2025
ఇక పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్.. భారతీయ రైల్వేలలో ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచి ధన్ బాద్ డివిజన్ కు బొగ్గు, ఇతర వస్తువుల రవాణాలో సహాయపడుతుంది. గూడ్స్ రైల్ కోచ్ లు తనిఖీ చేయడం, రిపేర్ చేయడం పెద్ద ఎత్తున జరుగుతుంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications