సంగమ్ థియేటర్ క్లోజ్: రాత్రి దెయ్యం హల్ చల్, వింత శభ్దాలు, ప్రజలు పరుగో పరుగు !
కోలారు జిల్లాలో మూతపడిన ఓ సినిమా థియేటర్ లో దెయ్యం తిరుగుతోందని వదంతులు వ్యాపించడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. సినిమా థియేటర్ నుంచి దెయ్యం ఎప్పుడు బయటకు వస్తూందో అంటూ స్థానిక ప్రజలు ఆసక్తిగా
బెంగళూరు: కోలారు జిల్లాలో మూతపడిన ఓ సినిమా థియేటర్ లో దెయ్యం తిరుగుతోందని వదంతులు వ్యాపించడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. సినిమా థియేటర్ నుంచి దెయ్యం ఎప్పుడు బయటకు వస్తూందో అంటూ స్థానిక ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముళబాగిల్ -రామసముద్రం రోడ్డులోని సంగమ్ థియేటర్ చాల కాలంగా మూతపడింది. ఈ సంగమ్ థియేటర్ నుంచి రాత్రి పూట వింత ఆకారం సంచరిస్తోందని, విచిత్ర శబ్ధాలు వస్తున్నాయని కొంత కాలంగా వదంతులు వ్యాపిస్తున్నాయి.

సంగమ్ థియేటర్ చుట్టుపక్కల వింత ఆకారాలు సంచరిస్తున్నాయని ప్రచారం జరగడంతో వందల సంఖ్యలో స్థానికులు సంగమ్ థియేటర్ ముందు గుమికూడారు. దెయ్యం ఎప్పుడు బయటకు వస్తుంది ? ఎలా ఉంటుంది ? శభ్దాలు ఎప్పుడు వస్తాయి అంటూ చర్చ మొదలైయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మూతపడిన థియేటర్ లో దెయ్యం లేదు, ఏమీ లేదని చెప్పి స్థానికులను అక్కడి నుంచి పంపించారు.












Click it and Unblock the Notifications