బీజేపీలోకి రమ్య?: వస్తే ఆత్మహత్యేనంటూ ఆ పార్టీ నేత సంచలనం!
ప్రముఖ కన్నడ సినీ కథానాయిక, కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్య త్వరలోనే పార్టీ మారుతున్నట్లు సమాచారం.
బెంగళూరు: ప్రముఖ కన్నడ సినీ కథానాయిక, కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్య త్వరలోనే పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఆమెకు గాడ్‌ఫాదర్ అయిన మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

బీజేపీలో చేరిన ఎస్ఎం కృష్ణ
బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో రమ్య తోపాటు మరికొందరు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

బీజేపీలోకి రమ్య
కాంగ్రెస్ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా రమ్య ఎన్నికయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించారు. అయితే, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

ఇటీవలే అంబరీష్
కన్నడ ప్రముఖ నటుడు, మాజీ మంత్రి అంబరీష్ కూడా ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కూడా బీజేపీలో బుధవారం చేరారు. ఈ క్రమంలో రమ్య కూడా బీజేపీలో చేరతారనే వార్తలో రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్నాయి.

రమ్య వస్తే ఆత్మహత్యే..
రమ్య ఒక వేళ బీజేపీలో చేరితే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మాండ్యా నియోజకవర్గానికి చెందిన మంజునాథ్ అనే బీజేపీ నేత బెదిరింపులకు గురిచేయడం సంచలనంగా మారింది. గతంలో బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ను తీవ్రంగా విమర్శించిన ఆమెను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

తీవ్ర విమర్శలు చేసిన రమ్య
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనలేదని, కాంగ్రెస్ పార్టీనే స్వాతంత్ర్య తెచ్చిందని గతంలో రమ్య అన్నారు. అంతేగాక, పాకిస్థాన్ స్వర్గధామమంటూ ఆ దేశంలో పర్యటించిన అనంతరం వ్యాఖ్యానించారు రమ్య.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications