రికార్డు కనిష్టానికి రూపాయి మారకం విలువ: మరింత క్షీణించే అవకాశం

రూపాయి మారకం విలువ మరోసారి రికార్డు స్థాయిలో పడిపోయింది. డాలరుతో పోలిస్తే జీవితకాల కనిష్ఠానికి క్షీణించి.. 2013లో ఎలాగైతే భయపెట్టిందో.. ఇప్పుడు అంతకుమించి కలవరపెడుతోంది.

ముంబై: రూపాయి మారకం విలువ మరోసారి రికార్డు స్థాయిలో పడిపోయింది. డాలరుతో పోలిస్తే జీవితకాల కనిష్ఠానికి క్షీణించి.. 2013లో ఎలాగైతే భయపెట్టిందో.. ఇప్పుడు అంతకుమించి కలవరపెడుతోంది. వాస్తవానికి గత 3 నెలల నుంచే రూపాయిపై ఒత్తిడి ఉంది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన ప్రయత్నాలతో రూపాయి పతనాన్ని నియంత్రించుకుంటూ వచ్చింది.

ఇప్పుడు ఆ పరిస్థితికి అవకాశాలు కనిపించడం లేదు. కారణం.. ట్రంప్‌ గెలుపు అనంతరం అమెరికాలో చోటుచేసుకుంటోన్న పరిణామాలే. ఆర్‌బీఐ ఎంత జోక్యం చేసుకుంటున్నప్పటికీ, దిగుమతిదార్ల నుంచి డాలర్లకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో రూపాయి నేలచూపులు చూడక తప్పడం లేదు. తాజా జీవనకాల కనిష్ఠమైన 68.86ను తాకిన రూపాయి.. మరికొన్ని రోజుల్లో 70కు పడిపోయే అవకాశాలూ లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

రేట్ల కోతకు అవరోధమే

అక్టోబరులో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, నోట్ల రద్దుతో బ్యాంకులకు డిపాజిట్లు పెరుగుతుండటం తదితరాల నేపథ్యంలో రానున్న పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించొచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే అమెరికా బాండ్ల ప్రతిఫలాలు పెరుగుతుండటం, రూపాయి క్షీణిస్తుండటంతో ఆర్‌బీఐ రేట్ల కోత దిశగా అడుగులు వేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Rupee flirts with record low against dollar, seen falling further

2015 నుంచి ఇప్పటివరకు 175 బేసిస్‌ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గించడంతో దేశీయ బాండ్ల ప్రతిఫలాలు గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు మళ్లీ కీలక రేట్లలో కోత విధిస్తే ఇవి మరింత తగ్గుతాయి. దీంతో ఇక్కడి బాండ్ల మార్కెట్ల నుంచి భారీగా నిధులు తరలిపోయే అవకాశం ఉంది. రూపాయి మరింత బలహీనపడటానికి ఈ పరిణామం దోహదం చేస్తుంది.

ప్రభుత్వం మాట

అమెరికాలో చోటుచేసుకుంటోన్న పరిణామాలతో డాలరు బలపడటం వల్ల రూపాయి కాకుండా అన్ని దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయని ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అంటున్నారు. అయితే రూపాయి కదలికలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సునిశితంగా గమనిస్తుందని చెబుతున్నారు.

మారకం విలువ 69 దిగువకు వచ్చే వరకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోకపోవచ్చని ఆయన సంకేతాలిచ్చారు. మరోవైపు కరెన్సీకి ఒడుదొడుకులు సర్వసాధారణమేనని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడుతున్నారు. రూపాయిలో స్థిరత్వం తీసుకొని వచ్చేందుకు జోక్యం చేసుకోవాలని కూడా ప్రభుత్వం అనుకోవడం లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+