డాలర్ ఢమాల్.. రూపాయికి జోష్: క్రమంగా బలపడుతోన్న రుపీ..
బుధవారం నాడు ట్రేడింగ్ ప్రారంభమైన ఆరంభంలో తొలుత 64.91వరకు రూపాయి బలహీనపడింది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ప్రధానంగా బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో దేశీ కరెన్సీ బలపడింది.
ముంబై: దేశీ కరెన్సీ రూపాయి క్రమ క్రమంగా బలపడుతోంది. డాలర్ మారకంతో వరుసగా రెండో రోజు కూడా రూపాయి బలపడింది. గురువారం 25పైసలు ఎగిసి 64.48వద్ద ట్రేడ్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం రూపాయి విలువ మరింత పుంజుకునే అవకాశం ఉంది.
బ్యాంకులకు అమెరికన్ కరెన్సీ డాలర్ లో పెరిగిన అమ్మకాల కారణంగా రూపాయికి మద్దతు లభిస్తోంది. ఫెడ్ పాలసీ అంచనాలతో డాలర్‌లో అమ్మకాల జోరు రూపాయికి మద్దతునిస్తోందని ఫారెక్స్ డీలర్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దేశీ మార్కెట్లలోను జోష్ వచ్చిందంటున్నారు.

బుధవారం నాటి ట్రేడింగ్ లో 7వారాల కనిష్ట స్థాయి నుంచి రూపాయి ఒక్కసారిగా పైకి ఎగబాకింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్, మార్కెట్లో రూపాయి 16పైసలు పుంజుకుని, 64.73 వద్ద ముగిసింది. డాలరుతో మారకం ద్వారా ఇటీవల బలహీనపడుతూ వచ్చిన రూపాయి మంగళవారం నాటి ట్రేడింగ్ లో ఒక్కసారిగా 34పైసలు పతనమై దాదాపు రూ.65స్థాయికి పతనమైంది.
బుధవారం నాడు ట్రేడింగ్ ప్రారంభమైన ఆరంభంలో తొలుత 64.91వరకు రూపాయి బలహీనపడింది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ప్రధానంగా బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో దేశీ కరెన్సీ బలపడింది.
ఇదిలా ఉంటే, సహాయక ప్యాకేజీలను ఉపసంహరించుకుంటున్నట్లుగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 3న నిర్వహించిన సమావేశంలో వెల్లడించింది. ఫెడ్ మినిట్స్ ద్వారా క్రమానుగుణంగా వడ్డీ రేట్లను పెంచుతామన్న సంకేతాల పంపించింది. దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. డాలర్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అలాగే ఫెడ్ మినిట్స్ దేశీయ ఈక్విటీ మార్కెట్లకు జోష్ వచ్చేలా చేసింది.












Click it and Unblock the Notifications