కామపిశాచాలు: రష్యా యువతికి లైంగిక వేధింపులు...ఆరుగురు అరెస్టు
మనదేశంలో లైంగిక వేధింపులు కేసులు ఎక్కువ అవుతున్నాయి. అమ్మాయి కనిపిస్తే చాలు ఆగడంలేదు కుర్రకారు. వారిని ఎలాగోలా లోబర్చుకోవాలనే తపన వారిని కటకటాలపాలయ్యేలా చేస్తోంది. మన దేశంలోని అమ్మాయిలనే కాదు విదేశీ అమ్మాయిలను కూడా వదలడం లేదు కామాంధులు. వారిపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతూ, లైంగిక వేధింపులకు దిగుతూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. చెన్నైలోని 11 ఏళ్ల చిన్నారిపై ఒక అపార్ట్ మెంట్‌లో అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే తాజాగా ఓ రష్యా యువతిపై లైగింక వేధింపులకు దిగారు తమిళనాడుకు చెందిన ఆరుగురు యువకులు.
తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలైను చూసేందుకు రష్యా యువతి వచ్చింది. ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది. గతవారంరోజులుగా ఆమె అదే అపార్ట్‌మెంట్‌లో ఉంది. అయితే సోమవారం రోజు ఆమె అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కొందరు హాస్పిటల్‌కు తరలించారు.

అక్కడ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు ఆమె శరీరంపై కొన్ని గాట్లను ఉండటాన్ని గమనించారు. ఎవరో కొరికినట్లుగా ఆమె శరీరంపై అచ్చులు ఉన్నాయి. దీంతో డాక్టర్లకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఏమైనా డ్రగ్స్ తీసుకుందా అన్న కోణంలో విచారణ చేశారు. అయితే ఆమెను హాస్పిటల్‌లో చేర్పించిన వారిని విచారణ చేయడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది.
రష్యా యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆమెను హాస్పిటల్‌లో చేర్చిన వ్యక్తి ఒప్పుకున్నాడు. ఆయనతో పాటు మరో ఐదుగురు కూడా యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు తెలిపారు. దీంతో వారందరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అపస్మారక స్థితి నుంచి ఆ రష్యా యువతి తేరుకుంది. తిరువన్నమలైలో ఆలయాలను తిలకించేందుకు ఆమె తమిళనాడుకు వచ్చినట్లు తెలిపింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications