భారత్‌కు అంతర్జాతీయంగా మంచిపేరు.. ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలిపిన రష్యా
ఢిల్లీ : 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భగా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జమ్ము కశ్మీర్ విభజన బిల్లు, ఆర్టికల్స్ 370, 35A రద్దు చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను సాకారం చేశామని చెప్పుకొచ్చారు.
జెండా పండుగతో తెలుగు రాష్ట్రాలు కూడా కొత్త శోభ సంతరించుకున్నాయి. ఏపీ, తెలంగాణలో ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. తెలుగు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఇక ఊరూవాడ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కాలనీలు, యూత్ సంఘాలు, కుల సంఘాలు తదితరులు పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా పార్టీ కార్యాలయాల్లో కూడా త్రివర్ణ పతాకం ఎగురవేశారు నేతలు.

ఐదుసార్లు ఎమ్మెల్యే.. హైదరాబాద్‌లో 5 రూపాయల భోజనం.. సింపుల్ మ్యాన్
అదలావుంటే స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకున్న ఇండియా.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రష్యా, భారత్ మధ్య సంబంధాలు ఇకపై కూడా కొనసాగాలని.. ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పడాలని ఆకాంక్షించారు. భారతదేశ ప్రజలకు మరిన్ని విజయాలు కలగాలని.. ఆరోగ్యంగా ఉంటూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లేఖలో రాశారు. కశ్మీర్ విభజన బిల్లుకు సంబంధించి పాకిస్థాన్ మద్దతు కోరిన నేపథ్యంలో రష్యా తిరస్కరించిన విషయం తెలిసిందే. ఐరాసతో పాటు సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాలు సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలని పాక్‌కు హితవు పలికింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications