గోవాలో దారుణం: రష్యన్ మహిళపై రెండుసార్లు రేప్

Russian woman alleges molestation by Goa Medical College doctor
పనాజి: గోవా సందర్శనకు వచ్చిన ఓ రష్యన్ మహిళపై అక్కడ రెండు సార్లు అత్యాచారం జరిగింది. తొలిసారి ‘బాగా' బీచులో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యుడు ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గోవా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్(జిఎంసిహెచ్)ను ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 16న గోవాకు చేరుకున్న బాధిత మహిళ 20వ తేదీ అర్ధరాత్రి బాగా బీచ్‌లో అత్యాచారానికి గురైంది. బాధితురాలి నుంచి విలువైన వస్తువులను దోచుకున్న ఆగంతకుడు ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జిఎంసిహెచ్‌కు పంపారు. ఆస్పత్రిలో తొలుత ఓ మహిలా వైద్యురాలు బాధితురాలికి పరీక్షలు నిర్వహించారు.

ఆ తర్వాత మరోమారు పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన సీనియర్ వైద్యుడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తునకు గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, గోవాలోని రష్యా రాయబార కార్యాలయంలో లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తున్న విక్రమ్ వర్మ తెలిపారు. కాగా, ఈ ఘటనపై జిఎంసిహెచ్ అధికారులు ఎవరూ స్పందించలేదు.

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

కుంతి: జార్ఖండ్ రాష్ట్రంలోని జల్తాండ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. మద్యం సేవించిన ఓ వ్యక్తి తన భార్యను బండతో మోది హత్య చేశాడు. ఆ సమయంలో అతని భార్య కూడా స్థానికంగా తయారు చేయబడే ఆ మద్యాన్ని సేవించి ఉంది. భార్యతో వాగ్వాదానికి దిగిన భర్త.. ఆగ్రహానికి గురై ఆమెను బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+