Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొండ గుహల్లో రష్యన్‌ మహిళ.. పోలీసులు చూసి షాక్..

ఎక్కడో రష్యా నుంచి వచ్చిన ఓ మహిళ.. కర్ణాటకలోని గోకర్ణలో దట్టమైన అభయారణ్యంలో ఓ కొండపై ఉన్న గుహలో జీవనం సాగిస్తోంది. ఎలాంటి భయం బెరుకూ లేకుండా ఇద్దరి పిల్లలతో ఆ గుహలోనే జీవిస్తోంది మహిళ. అయితే తాజాగా ఆ కుటుంబాన్ని పోలీసులు రక్షించారు. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆశ్రమంలోకి తరలించారు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

రష్యాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కర్ణాటకలోని గోకర్ణలో దట్టమైన అభయారణ్యంలో ఉన్న రామతీర్థ కొండపై గల గుహలో జీవనం సాగిస్తోంది. పాట్రోలింగ్ లో భాగంగా గుహలో వెళుతురు, కదలికలు గమనించి వెళ్లి చూడగా షాక్ తిన్నారు. అతి కష్టం మీద ఆ గుహలోకి వెళ్లి ఆ కుటుంబాన్ని రక్షించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆ కుటుబం రక్షణ, భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు.

Russian Woman and Two Daughters Found Living in Remote Gokarna Cave

ఈ ఘటన జులై 9 వెలుగులోకి వచ్చింది. స్థానిక ఇన్ స్పెక్టర్ శ్రీధర్, అతని టీమ్ రామతీర్థ కొండపై పాట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడికి వస్తున్న భక్తులకు పలు సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొండపై గల అభయారణ్యం ప్రాంతంలో అలికిడి విన్నారు. అనంతరం కొద్దిసేపు గాలించగా గూహలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఉండటం గమనించారు. ఆమె రష్యాకు చెందిన నీనా కుటినా(40), ప్రేమ(6), అమ(4) గా గుర్తించారు.

అయితే ఆమెను ఆశ్రమానికి తరలించిన పోలీసులు అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా.. తాను గోవా మీదుగా గోకర్ణ వచ్చినట్లు తెలిపింది. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం తాను అలా గుహలో గడుపుతున్నానని పేర్కొంది. నగర జీవితానికి దూరంగా కొండల్లోని అడవుల్లో, గుహల్లో ఆధ్యాత్మిక జీవితం, ప్రార్థన చేసుకుంటూ జీవించాలని అనుకున్నట్లు తెలిపింది.

బిజినెస్‌ వీసాపై భారత్‌ కు వచ్చింది నీనా.. ఆధ్యాత్మికతకు ఆకర్షితం అయింది. గోవా నుంచి గోకర్ణకు వెళ్తున్న సమయంలో అక్కడి అడవి ప్రాంతం ఆమెకు నచ్చింది. దట్టమైన అడవులో ఉన్న గుహలో ఓ చిన్న నివాసం ఏర్పరచుకొంది. అక్కడే రుద్ర విగ్రహాన్ని పెట్టుకొని నిత్యం పూజలు చేస్తోంది. ఆమె వెంట ఇద్దరు పిల్లలు ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+