'కిటికీ సన్ బాత్..' ఎక్స్ పోజింగ్ తట్టుకోలేమంటున్న జనం
రష్యా : ఓ మహిళ సన్ బాత్ వ్యవహారం అక్కడి కాలనీ వాసులకు తలనొప్పిగా మారింది. సాధారణంగా సన్ బాత్ లకు కేరాఫ్ బీచ్ అయితే ఈ మహిళ మాత్రం తన ఇంటి కిటికీనే సన్ బాత్ కు అడ్డాగా మార్చుకుంది. ఇంకేముంది ఆమె స్కిన్ షో చూడలేక అక్కడి ఇరుగుపొరుగు వాళ్లు ఇబ్బంది పడుతుంటే, సదరు మహిళ మాత్రం ఇదేమి పట్టనంటూ తన పని తాను కానిచ్చేస్తోంది.
రష్యాలోని నోవోసిబిర్క్స్ క్రోపోట్కిన్ వీధిలో జరుగుతున్న ఈ వ్యవహారమంతా ఇప్పుడు అక్కడో హాట్ టాపిక్. సోషల్ మీడియాలోను సదరు సన్ బాత్ గురించే చర్చంతా. ఇంతకీ అసలు విషయమేంటంటే.. క్రోపోట్కిన్ వీధిలోని ఓ అపార్ట్ మెంటు రెండో అంతస్తులో నివాసముండే ఓ మహిళ కిటికీ నుంచి నడుము, కాళ్లు బయటకు బార్లా చాపి సన్ బాత్ చేస్తోంది.

టూ పీస్ బికినీలో ఆమె చేస్తోన్న సన్ బాత్ ను కొంతమంది ఆసక్తిగా గమనిస్తోంటే, అక్కడి కాలనీవాసులు మాత్రం పిల్లలు, పెద్దలు తిరిగే చోట ఈ స్కిన్ షో ఏంటని మండిపడుతున్నారు. ప్రతిరోజు ఆమె సన్ బాత్ స్కిన్ షో ను భరించడం ఇక తమవల్ల కాదనుకున్న సదరు కాలనీ వాసులంతా ఏకమై ఆమె కిటికీ సన్ బాత్ కు వ్యతిరేకంగా కాలనీలో సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఆ సంతకాలతో కూడిన పిటిషన్ ను స్థానికి బిల్డింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా ఆమె సన్ బాత్ కు ఫుల్ స్టాప్ పెట్టించాలని ఫిర్యాదు చేశారు.
అయితే బిల్డింగ్ అధికారులు కూడా తామేమి చేయలేమని చేతులెత్తేయడంతో, సదరు మహిళ కిటికీ సన్ బాత్ యథావిధిగా కొనసాగుతోంది. అంతేకాదు కేవలం కాళ్లు, నడుము భాగం మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు తన పైభాగాన్ని కూడా కిటికీలోంచి బయటకు పెట్టి సన్ బాత్ చేస్తోందట సదరు మహిళ.
దీంతో కొంతమంది వ్యక్తులు ఆమె కిటికీ సన్ బాత్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలోకి ఎక్కించేయడంతో ఇప్పుడామె 'కిటికీ సన్ బాత్' టాపిక్ వైరల్ గా మారిపోయింది.












Click it and Unblock the Notifications