Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sabarimala: అయ్యప్ప భక్తులకు ఎక్కువ అవకాశం, హైకోర్టులో కేరళ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, పక్కా క్లారిటీ!

శబరిమల/ కొచ్చి/ పంపా: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు త్వరలో మరో గుడ్ న్యూస్ రానుంది. శబరిమలకు అయ్యప్పస్వామి భక్తుల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించామని కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు సమాచారం ఇచ్చింది. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధిని అడ్డం పెట్టుకుని అయ్యప్పస్వామి భక్తులు శబరిమలకు వెళ్లడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులను పరిమితి సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. ఇలాంటి సందర్బంలో కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను పెంచుతామని సమాచారం ఇవ్వడంతో అయ్యప్ప భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ కనుమల్లో అయ్యప్ప

పశ్చిమ కనుమల్లో అయ్యప్ప

కేరళ పశ్చిమ కనుమల్లోని పుణ్యనది పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రతిఏడాది పెరుగుతూనే ఉంటుంది, అయితే ప్రస్తుత కరోనా వైరస్ దెబ్బకు అయ్యప్ప భక్తుల సంఖ్య చాలా తగ్గిపోయింది. కేరళ ప్రభుత్వం COVID-19 నియమ నిబంధనలు అంటూ అయ్యప్ప భక్తులకు అనేక నియమాలు విధించడం భక్తుల సంఖ్య తగ్గిపోవడానికి మరో ప్రధాన కారణం అయ్యింది.

ప్రభుత్వానికి పదేపదే మనవి

ప్రభుత్వానికి పదేపదే మనవి

శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు గతంలో ఉన్న నియమాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించుకుండా కేరళ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. మండలపూజ, మకరవిలక్కం సీజన్ ప్రారంభం అయిన సందర్బంగా పరిమితి సంఖ్యలో శబరిమలలోకి అయ్యప్పస్వామి భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఎకువ మంది అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు తగ్గట్లు తాము ఏర్పాట్లు చేశామని, కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని శబరిమల దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు పదేపదే మనవి చేశారు.

A to Z చూస్తున్నాం

A to Z చూస్తున్నాం

శబరిమలకు వస్తున్న అయ్యప్ప భక్తులకు నీలక్కల్, పంపా, శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్ప భక్తులు బస చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉందని శబరిమల అయ్యప్పస్వామి బోర్డు కమిటీ అంటోంది. అయ్యప్ప భక్తులకు వైద్యసేవలు అందించడానికి నీలక్కల్, పంపా, సన్నిధానంలో అన్ని ఏర్పాట్లు చేశామని, క్రమం తప్పకుండా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా పాజిటివ్ వచ్చిన భక్తులను శబరిమల సన్నిధానంలోకి అనుమతి ఇవ్వడం లేదని శబరిమల దేవస్వం బోర్డు నిర్వహకులు కేరళ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు.

పర్వాలేదు.... కానీ, 40 % మందికి నో చాన్స్!

పర్వాలేదు.... కానీ, 40 % మందికి నో చాన్స్!

శబరిమల దేవస్వం బోర్డు మనవి మేరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు అయ్యప్ప సన్నిధానం వెళ్లే భక్తుల సంఖ్యను పరిమితం చేసినా శనివారం, ఆదివారం రోజుల్లో రెండు వేల సంఖ్యను మూడు వేలకు పెంచుతూ కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే శబరిమలకు వెళ్లడానికి వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు 40 శాతం మంది అవకాశం చిక్కకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టులో ప్రభుత్వం వివరణ

హైకోర్టులో ప్రభుత్వం వివరణ

ఈ సందర్బంగా కేరళ ప్రభుత్వం శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను తాము పెంచుతామని, ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు పూర్తి చేసిన తరువాత వారు అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకోవడానికి అవకాశం ఇస్తామని కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు పూర్తి సమాచారం ఇచ్చింది.

Recommended Video

    #SabarimalaTemple: కేరళలో భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయం ... మకరవిలక్కు పూజకు 5 వేలమందికి అనుమతి !
    నీలక్కల్ లో పరీక్షలు. హైకోర్టుకు నివేదిక

    నీలక్కల్ లో పరీక్షలు. హైకోర్టుకు నివేదిక

    శబరిమలకు వెలుతున్న అయ్యప్ప భక్తులకు నీలక్కల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ పరీక్షా కేంద్రాల్లో భక్తులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతి రోజూ 300 నుంచి 500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాతే అయ్యప్ప భక్తులను సన్నిధానంలోకి అనుమతి ఇస్తున్నామని దేవస్వం శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేరళ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. నీలక్కల్ ఇప్పటి వరకు 24 మందికి కరోనా నెగటివ్ అని వచ్చిందని, వారిలో ముగ్గురు పోలీసులు, ఇద్దరు TDB సిబ్బంది ఉన్నారని కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు సమాచారం ఇచ్చింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+