వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: శబరిమలలో మకరవిళక్కు ప్రారంభం, లక్ష మంది భక్తుల కోసం ఏర్పాట్లు, మకరజ్యోతి!

|
Google Oneindia TeluguNews

శబరిమల/పతనంతిట్ట/కొచ్చి: హిందువుల పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైన, వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మకర సంక్రాంతి సందర్బంగా శబరిమలో అయ్యప్పస్వామిని దర్శించుకుని మకర జ్యోతిని దర్శించుకుంటే మా పాపాలు అన్నీ తొలగిపోతాయని అయ్యప్పస్వామి భక్తులకు నమ్మకం. అయ్యప్పస్వామి ఆకాశంలో మకర జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చే సందర్బంగా వారం రోజుల పాటు శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాలు నిర్వహిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వైరస్ దెబ్బతో శబరిమలలో అయ్యప్పస్వామి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

Recommended Video

#SabarimalaTemple: కేరళలో భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయం ... మకరవిలక్కు పూజకు 5 వేలమందికి అనుమతి !

అదనపు సిబ్బందిని విధుల్లో నియమించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా అయ్యప్ప భక్తుల కోసం వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకువచ్చారు. శబరిమలతో మకరవిళక్కును పురస్కరించుకుని వస్తున్న అయ్యప్ప భక్తుల అవసరాలు తీర్చడానికి సిబ్బందితో పాటు వ్యూపాయింట్ దగ్గర, పంబా నుంచి శబరిమలకు వెళ్లే మార్గం మొత్తం, ఏరిమేళిలతో పాటు అయ్యప్పస్వామి భక్తులు సంచరించే అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాటు కట్టదిట్టం చేశారు. మకరవిళక్కు సందర్బంగా లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు శబరిమలలో బస చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Varanasi: హిందువులకు స్వాగతం, హిందువులు కాని వాళ్లు వెళ్లిపోండి, వార్నింగ్, మోడీ ఇలాకాలో!Varanasi: హిందువులకు స్వాగతం, హిందువులు కాని వాళ్లు వెళ్లిపోండి, వార్నింగ్, మోడీ ఇలాకాలో!

మకర జ్యోతి రూపంలో అయ్యప్పస్వామి దర్శనం

మకర జ్యోతి రూపంలో అయ్యప్పస్వామి దర్శనం

కేరళలోని పతనంతిట్టలోని శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మకర సంక్రాంతి సందర్బంగా శబరిమలో అయ్యప్పస్వామిని దర్శించుకుని మకర జ్యోతిని దర్శించుకుంటే మా పాపాలు అన్నీ తొలగిపోతాయని అయ్యప్పస్వామి భక్తులకు నమ్మకం. జీవితంలో ఒక్కసారి అయినా జ్యోతి దర్శనం కోసం అయ్యప్పస్వామి జ్యోతికి మాల వెయ్యాలని ప్రతి అయ్యప్పస్వామి భక్తుడు ఆశపడుతుంటాడు.

మకరవిలక్కు..... అదనపు సిబ్బంది

మకరవిలక్కు..... అదనపు సిబ్బంది

అయ్యప్పస్వామి ఆకాశంలో మకర జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చే సందర్బంగా వారం రోజుల పాటు శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాలు నిర్వహిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వైరస్ దెబ్బతో శబరిమలలో అయ్యప్పస్వామి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

లక్ష మంది భక్తుల కోసం ఏర్పాట్లు

లక్ష మంది భక్తుల కోసం ఏర్పాట్లు

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, ఒమిక్రాన్ వైరస్ దెబ్బతో ప్రతిరోజు కేవలం 30 వేల మంది అయ్యప్పస్వామి భక్తులు శబరిమలో అయ్యప్పను దర్శించుకోవడానికి అవకాశం ఉంది. మకరవిళక్కు, మకరజ్యోతి దర్శనం కోసం లక్ష మందికి పైగా అయ్యప్పస్వామి భక్తులు శబరిమలకు వస్తారని శబరిమల దేవస్థానం బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.

సన్నిధానంలో భారీ ఏర్పాట్లు

సన్నిధానంలో భారీ ఏర్పాట్లు

మకరవిళక్కు ఉత్సవాల సందర్బంగా శబరిమల అయ్యప్పస్వామి వెలసిన సన్నిధానంలో అదనపు ఉద్యోగులను నియమించారు. ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, ఎన్ డీఆర్ఎఫ్ అధికారులు, సిబ్బంది, అగ్నిమాపక శాఖ, పారిశుద్ద కార్మికల సంఖ్యలను రెండింతలు పెంచారు. శనివారం నుంచి 50 శాతం మంది, ఆదివారం మరో 50 శాతం మంది అదనపు ఉద్యోగులు శబరిమలలో విధులకు హాజరౌతారని శబరిమల ఆలయ కమిటీ బోర్డు అధికారులు, దేవస్థానం బోర్డు అధికారులు మీడియాకు చెప్పారు.

అయ్యప్ప భక్తుల కోసం భద్రతా ఏర్పాట్లు

అయ్యప్ప భక్తుల కోసం భద్రతా ఏర్పాట్లు

కరోనా వైరస్ వ్యాపించకుండా అయ్యప్ప భక్తుల కోసం వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకువచ్చారు. శబరిమలతో మకరవిళక్కును పురస్కరించుకుని వస్తున్న అయ్యప్ప భక్తుల అవసరాలు తీర్చడానికి సిబ్బందితో పాటు వ్యూపాయింట్ దగ్గర, పంబా నుంచి శబరిమలకు వెళ్లే మార్గం మొత్తం, ఏరిమేళిలతో పాటు అయ్యప్పస్వామి భక్తులు సంచరించే అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాటు కట్టదిట్టం చేశారు.

పండితావలంలో ఏర్పాట్లు

పండితావలంలో ఏర్పాట్లు

మకరవిళక్కు సందర్బంగా లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు శబరిమలలో బస చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మకరజ్యోతిని దర్శించుకోవడానికి వెళ్లే అయ్యప్పస్వామి భక్తులు దాదాపుగా అందరూ పండితావలంలోనే ఉండటానికి ఆశపడుతారు. పండితావలంలో భారీ ఎత్తున బ్యారికేడ్లు, అదనంగా తాత్కాలిక మరుగుదోడ్లు ఏర్పాటు చేశామని శబరిమల ఆలయ కమిటీ బోర్డు అధికారులు, పోలీసు అధికారులు అంటున్నారు.

స్వామియే శరణం అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప

శబరిమలో, సన్నిధానంలో అయ్యప్పస్వామి ప్రసాదం పంపిణి చెయ్యడానికి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మకరవిళక్కు సందర్బంగా శబరిమలకు వస్తున్న అయ్యప్పస్వామి భక్తుల కోసం అయ్యప్పస్వామి ప్రసాదం, 5 లక్షల టిన్నుల ప్రసాదం అందుబాటులో ఉంటుందని శబరిమల అయ్యప్పస్వామి ఆలయ కమిటీ బోర్డు అధికారులు అంటున్నారు.

శబరిమల అయ్యప్పస్వామిని మకరజ్యోతి రూపంలో దర్శించుకోవడానికి సుమారు లక్ష మందికి పైగా ఆయ్యప్ప భక్తులు వెలుతున్న సందర్బంగా అయ్యప్ప భక్తులు మాస్క్ లు కచ్చితం వేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సంబంధిత అధికారులు అంటున్నారు.

English summary
Sabarimala: Makaravilakku facilities has been started at Sabarimala in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X