Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sabarimala: అయ్యప్ప సన్నిధానంలో నేడు మండలపూజ, ప్రత్యేక పూజలు, స్వామియేశరణం అయ్యప్ప !

శబరిమల/ పంపా/కొచ్చి: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేరళలోని శబరిమల సన్నిధానంలో నేడు మండలపూజ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయ్యప్పస్వామికి ఎంతో పవిత్రమైన బంగారు నగలు తీసుకెళ్లే తంక-అంకి కార్యక్రమం కన్నుల పండుగా పూర్తి అయ్యింది. అరుణ్ముల పార్థసారథి ఆలయంలోని ఉన్న అయ్యప్పస్వామికి రాజుల కాలంలో తయారు చేయించిన బంగారు, వజ్రాల నగలు శుక్రవారం సాయంత్రానికి శబరిమల ఆలయంలోని సన్నిధానంకు తీసుకెళ్లారు. శనివారం శబరిమలలో అయ్యప్పస్వామి మండలపూజ నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్దం చేశారు.

 శబరిమల సన్నిధానం

శబరిమల సన్నిధానం

హిందువులోని పురుషులు వారి జీవితంలో ఒక్కసారైనా అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని దేవుడిని ప్రార్థిస్తుంటారు. నవంబర్ 15వ తేదీన కేరళలోని శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలో మండల పూజకు సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవంబర్ 16వ తేదీ నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలలోని సన్నిధానంలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అయ్యప్ప భక్తులకు అవకాశం ఇచ్చారు. ఆరోజు ప్రతిరోజూ శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు వెళ్లి వస్తున్నారు.

 బంగారు నగల ఊరేగింపు

బంగారు నగల ఊరేగింపు

శబరిమల అయ్యప్పస్వామికి రాజుల కాలంలో తయారు చేయించిన నగలకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అరణ్ములలోని పార్థసారథి దేవాలయంలో ఉన్న అయ్యప్పస్వామి ఆభరణాలను ఊరేగింపుగా శుక్రవారం పంపా నదిలోని శ్రీ గణపతి ఆలయంలోకి తీసుకెళ్లారు. శుక్రవారం మద్యాహ్నం 1 గంట నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు పంపాలోని గణపతి ఆలయంలో అయ్యప్పస్వామి అభరణాల ప్రదర్శనకు పెట్టారు.

 సన్నిధానం చేరుకున్న అయ్యప్ప నగలు

సన్నిధానం చేరుకున్న అయ్యప్ప నగలు

పంపా నదిలోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు తరువాత అయ్యప్ప ఆభరణాలు తరలించే సిబ్బందికి అప్పగించారు. అయ్యప్ప నగలను భక్తిశ్రద్దలతో పూజించిన ప్రత్యేక సిబ్బంది ఆ నగలు తల మీద మోస్తూ శబరిమలలోని అయ్యప్ప సన్నిధానానికి తీసుకెళ్లారు. భారీ బందోబస్తుతో అటవి మార్గంలో అయ్యప్ప స్వామి ఆభరణాలను సాయంత్రం 5 గంటలకు శబరిమలకు తీసుకెళ్లారు.

 ఘనస్వాగతం

ఘనస్వాగతం

సన్నిధానం చేరుకున్న అయ్యప్పస్వామి ఆభరణాలను శబరిమల ఆలయ అధికారులు, అర్చకులు భక్తిశ్రద్దలతో స్వాగతం పలికారు. సాయంత్రం 6.30 గంటలకు అయ్యప్పస్వామికి ప్రత్యేక బంగారు నగలు అలంకరించి సాంప్రధాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం శబరిమలలో మండల పూజ ఘనంగా నిర్వహించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.

 అయ్యప్ప మండల దీక్ష

అయ్యప్ప మండల దీక్ష

శనివారం శబరిమలలో జరుగుతున్న మండల పూజ సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శబరిమల అయ్యప్పస్వామి 42 రోజుల మండల దీక్ష ప్రత్యేక పూజలు శనివారం వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్దం అయ్యాయి. అయ్యప్పస్వామి భక్తులు దాదాపుగా మండల దీక్ష చేపట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. మండల దీక్ష చేపట్టిన అయ్యప్పస్వామి భక్తులను అయ్యప్పస్వామి కరుణిస్తాడని ఎంతో నమ్మకం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+