Sabarimala Virtual Queue Booking 2026: అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్.. ఆ రోజు నుంచి ఆన్ లైన్ బుకింగ్స్
దక్షిణభారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయం ఒకటి. దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి మాల వేసే భక్తులు శబరిమల చేరుకుని అయ్యప్పకు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం శబరిమల మండల-మకరవిళక్కు సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త అందింది. శబరిమలలో 2026-27 మండల- మకరవిళక్కు ఉత్సవాలకు సంబంధించి వర్చువల్ క్యూ బుకింగ్ ప్రక్రియ అక్టోబర్ 29న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. భక్తులు దర్శనం స్లాట్స్ ను ఉచితంగానే ఆలయ అధికారిక వెబ్ సైట్ అయిన www.sabarimalaonline.org. లో బుక్ చేసుకోవాలని సూచనలు చేసింది.
ది నిలక్కల్- పంబా రూట్ లో అత్యధికంగా ప్రతిరోజూ ఆన్ లైన్ బుకింగ్ కోసం 60 వేల స్లాట్స్ ను అందుబాటులో ఉంచింది దేవస్థానం బోర్డు. అలాగే ఎరుమేళి ఫారెస్ట్ రూట్, వండీ పెరియార్- సత్రం రూట్లలో ఒక్కో రూట్ కు 3 వేల మంది భక్తుల కోసం స్లాట్లు ఏర్పాటు చేసింది. అంతేకాక నిలక్కల్, ఎరుమేలి, వండీపెరియార్ ప్రాంతాల్లో రియల్ టైమ్ స్పాట్ బుకింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు భక్తుల కోసం మరో సదుపాయం కల్పించనుంది దేవస్థానం బోర్డు. ది నిలక్కల్ స్పాట్ బుకింగ్ సెంటర్ లో ప్రతిరోజూ 10 వేల మంది భక్తులకు వసతి సదుపాయం కల్పించనుంది. అలాగే ఎరుమేలి, వండీపెరియార్ సత్రాల్లో రోజుకు దాదాపు 2 వేల మంది భక్తులకు వసతి సదుపాయం కల్పించనున్నారు. అయితే పంబా ప్రాంతంలో స్పాట్ బుకింగ్ సెంటర్ ను కేరళ హైకోర్టు తొలగించింది. ఇక ఈ మూడు ప్రాంతాలను కలిపితే ప్రతి రోజూ 80 వేల స్లాట్స్ అందుబాటులో ఉంచనుంది దేవస్థానం బోర్డు.
ఇక వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ఉచితమేనని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అయితే భక్తులు రూ. 5 ను వాలంటరీ లేదా భక్తుల రిలీఫ్ ఫండ్ కింద చెల్లించవచ్చని పేర్కొంది. అయితే ఈ రూల్స్ కేవలం ఆప్షన్ మాత్రమేనని పూర్తి బుకింగ్ విధానానికి ఇవి ఏమాత్రం అడ్డురావని తెలిపింది. ఇక వర్చువల్ క్యూ బుకింగ్ కోసం భక్తులు.. యాక్టివ్ లో ఉన్న మొబైల్ నెంబర్.. ఈమెయిల్ ఐడీతోపాటు ఓ వాలిడ్ ఐడెంటిటీ డాక్యూమెంట్ అవసరం అని తెలిపింది. ఈ మేరకు ఆధార్ కార్డు, వోటర్ ఐడీ లేదా పాస్ పోర్టు అవసరం అని స్పష్టం చేసింది. అలాగే భక్తులు 30 కేబీ లోపు ఉండే పాస్ పోర్టు సైజు ఫొటోను కూడా అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. ఈ స్లాట్స్ బుకింగ్ కోసం భక్తులు తొలుత శబరిమల ఆన్ లైన్ సర్వీసెస్ పోర్టల్ అయిన www.sabarimalaonline.org. ను సంప్రదించాలని స్పష్టం చేసింది. బుకింగ్ సమయంలో భక్తులు ఎలాంటి ఫ్రాడ్ వెబ్ సైట్స్ ను నొక్కొద్దని పేర్కొంది.

ఇక ఈ ఏడాది శబరిమల మండల- మకరవిళక్కు వేడుకలకు సంబంధించిన తేదీలను చూస్తే నవంబర్ 16 న సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇక నవంబర్ 17 నుంచి మండల కాలం ప్రారంభం కానుంది. డిసెంబర్ 27న మండల పూజ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 30న మకరవిళక్కు ఉత్సవాల కోసం తిరిగి తెరుస్తారు. ఇక 2027 జనవరి 14 మకరవిళక్కు వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత జనవరి 20న ఈ సీజన్ యాత్ర ముగియనుంది. ఈ వేడుకలకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications
