నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం: నీలక్కల్, పంబలో స్పాట్ బుకింగ్- ఏర్పాట్లు

మండల-మకరవిళక్కు యాత్ర కోసం ప్రసిద్ధ శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయం తలుపులు నేడు తెరచుకోనున్నాయి. ఈ సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో ప్రస్తుత మేల్‌శాంతి ఈడీ ప్రసాద్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరుస్తారు. దీపారాధన చేస్తారు. ఈ వేడుకతో రెండు నెలల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగే శబరిమల మండల యాత్రా కాలం మొదలవుతుంది.

18 మెట్లు దిగి పవిత్ర ఆళి వెలిగించిన అనంతరం కొత్తగా ఎంపికైన మేల్‌శాంతిలను ట్రావెన్ కూర్ దేవస్వం బోర్డు అధికారులు, అర్చకులు సన్నిధానానికి సంప్రదాయబద్ధంగా ఆహ్వానిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు సోపానం వద్ద నూతన శబరిమల మేల్‌శాంతిగా అరిక్కార సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూద్రిని తంత్రి అభిషేకం చేసి బాధ్యతలు అప్పగిస్తారు. అదే సమయంలో మాళికాప్పురం ఆలయ నూతన మేల్‌శాంతిగా ఏ దామోదరన్ నంబూద్రి ప్రమాణ స్వీకారం చేస్తారు.

Sabarimala temple set to open today for Mandala-Makaravilakku pilgrimage Nilakkal Pamba spotbooking

డిసెంబర్ 27వ తేదీ వరకు

మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు నూతన మేల్‌శాంతిలు శబరిమల, మాళికప్పురం ఆలయ ద్వారాలను తెరవడంతో మండల పూజల క్రతువు ప్రారంభమౌతుంది. డిసెంబర్ 27వ తేదీన అత్యంత వైభవంగా మండల పూజ నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి ఆలయాన్ని మూసివేయడంతో మండల యాత్ర ముగుస్తుంది. తిరిగి మకరవిళక్కు ఉత్సవాల కోసం అదేనెల 30న సాయంత్రం తలుపులు తెరుస్తారు.

80,000 మందికి

జనవరి 14న మకరవిళక్కు పూజ జరగనుండగా, అదే నెల 19వ తేదీ వరకు భక్తులకు దర్శన అవకాశం ఉంటుంది. జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. మండల యాత్ర సందర్భంగా శబరిమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి రోజుకు గరిష్ఠంగా 80,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని దేవస్వం బోర్డు నిర్ణయించింది. భక్తులందరికీ ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఈ మొత్తం కోటాలో 66,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా అవకాశం కల్పిస్తారు.

14,000 మందికి స్పాట్ బుకింగ్

ఇందులో నీలక్కల్-పంబ మార్గం ద్వారా 60,000, ఎరుమేలి అటవీ మార్గం ద్వారా 3,000, వండిపెరియార్-సత్రం మార్గం ద్వారా 3,000 మంది భక్తులు వర్చువల్ క్యూలో తమ స్లాట్ ను బుక్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోలేని భక్తుల సౌకర్యార్థం రోజుకు 14,000 మందికి స్పాట్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంచారు. నీలక్కల్ పాయింట్ వద్ద 10,000, ఎరుమేలి, వండిపెరియార్ లలో 2,000 మందికి స్పాట్ బుకింగ్ టోకెన్లు జారీ చేస్తారు.

వర్చువల్ క్యూ టోకెన్

నేడు 30,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తుల రద్దీని నివారించడానికి ఈ మధ్యాహ్నం 12 గంటల తర్వాతే నీలక్కల్ నుంచి పంబ వైపునకు వాహనాలను అనుమతిస్తారు. భక్తుల సౌకర్యార్థం పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో కేరళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. శబరిమల మార్గంలో తాగునీరు, అన్నదానం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. వర్చువల్ క్యూ టోకెన్, గుర్తింపు కార్డు ఉన్న భక్తులను మాత్రమే పంబ మీదుగా సన్నిధానానికి అనుమతిస్తారు.

విస్తృత ఏర్పాట్లు

అలాగే క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం, దేవస్వం బోర్డు.. పంబ, నిలక్కల్, సన్నిధానం ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఎలాంటి అసౌకర్యం కలగకుండా యాత్రికులు తమకు కేటాయించిన దర్శన సమయాన్ని అనుసరించి మాత్రమే పంబకు చేరుకోవాలని దేవస్వం అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+