లగడపాటి స్ప్రే చిన్న అంశం, సభ కమల్ ఇల్లా?: సబ్బం
న్యూఢిల్లీ: విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ లోకసభలో పెప్పర్ స్ప్రే చల్లడం చిన్న విషయమని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు. లోకసభను మంత్రి కమల్ నాథ్ ఏమైనా ఆయన సొంతిల్లు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎంపీల పైన సస్పెన్షన్ అప్రజాస్వామికమన్నారు. లోకసభ స్పీకర్ మీరా కుమార్ బిఫారం కోసమే ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.
తెలంగాణ ఇవ్వవద్దని తాము ఎప్పుడు చెప్పలేదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వారే అపహాస్యం చేస్తున్నారని, ఇతర పార్టీల ఎంపీలను తమపై మార్షల్స్‌గా ఉపయోగించారని మండిపడ్డారు. పార్లమెంటులో గూండాగిరి చేశారన్నారు. లగడపాటి చేసింది చిన్న విషయంగానే తాము భావిస్తున్నామన్నారు. కమల్ నాథ్ పార్లమెంటును తన ఇల్లు అనుకుంటున్నారా అన్నారు. ఎంతో ముఖ్యమైన బిల్లును రహస్యంగా పెట్టడమేమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి కూడా తెలియకుండా పెట్టారన్నారు.

ఆత్మరక్షణ కోసమే లగడపాటి పెప్పర్ స్ప్రే ఉపయోగించారని చెప్పారు. పార్లమెంటు జన్‌పథ్ కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. పార్లమెంటులో ఇలాంటి సంఘటనలు జరగవు కానీ ఆత్మరక్షణ కోసం లగడపాటి స్ప్రే చేయక తప్పలేదన్నారు. అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు నిలబెట్టి కాల్చారని, ఆయన చరిత్రలో నిలిచిపోయారన్నారు. లగడపాటి పెప్పర్ స్ప్రే చల్లడానికి కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు.
లగడపాటి ఎందుకు స్ప్రే చేశారో అర్థం చేసుకోరా అన్నారు. ఆయన చేసిన విషయాన్నే చూస్తున్నారు కానీ ఎందుకు చేశారో తెలుసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నారు. కాంగ్రెసు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతూ బహిష్కరణకు గురైన వారిలో కోవర్టులు ఎవరు లేరన్నారు.
మేమూ వెల్లోనే: హర్ష కుమార్
తాను, తనతో పాటు కేంద్రమంత్రులు కూడా వెల్లోనే ఉన్నప్పటికీ కేవలం వారినే ఎందుకు సస్పెండ్ చేశారని హర్ష కుమార్ ప్రశ్నించారు. స్పీకర్ కార్యాలయం పక్షపాతం చూపిస్తోందన్నారు. కమల్, కాంగ్రెసు పార్టీ ఎలా ఆడమంటే స్పీకర్ అలా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తమను హైదరాబాదు నుండి వెళ్లిపోమంటున్నారని, టెన్ జనపథ్ నుండి వారు వెళ్తే ఆ బాధేంటో తెలుస్తుందని సోనియాను ఉద్దేశించి అన్నారు. తాము కాంగ్రెసు కోసం ఉద్యమాలు చేశామన్నారు. లోకసభ సాక్షిగా దాడి ఎంపీల కుట్ర అన్నారు.












Click it and Unblock the Notifications