మావోయిస్ట్ అగ్రనేత సవ్యసాచి పాండా అరెస్ట్

మావోలతో విభేదించిన అతను సొంతగా ప్రత్యేక దళాలను నడుపుతున్నాడు. ఒడిశా ఎమ్మెల్యే హక్కా కిడ్నాప్, ఇరాక్ దేశీయుల కిడ్నాప్ కేసులో పాండా నిందితుడు. మావోయిస్టులతో విభేదించి బయటకు వచ్చిన పాండా.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్)ని నడుపుతున్నాడు.
బరంపుర పట్టణ ప్రాంతంలో అతనిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. అతని నండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. సవ్యసాచి పాండాకు గంజం, కందమాల్, గజపతి, రాయగడ తదితర ప్రాంతాల్లో గట్టి పునాదులు ఉన్నాయి. పాండా పూరీలోని సమంత్ చంద్రశేఖర ప్రభుత్వ కళాశాలలో మేథమేటిక్స్‌లో గ్రాడ్యుయేట్ చేశారు.












Click it and Unblock the Notifications