బాల్యం నుండి అంజలితో ప్రేమ, క్రికెట్: జీవిత చరిత్ర సినిమాలో సచినే..

ముంబై: భారత మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్ర పైన సినిమా నిర్మించేందుకు మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన 200 నాటౌట్ అనే నిర్మాణ సంస్థ సిద్ధమవుతోంది. ఆంగ్ల పత్రికలో వస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.

సచిన్ టెండుల్కర్ జీవిత పైన రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం పనులు ప్రారంభం కానున్నాయంట. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రెండువేల థియేటర్లలో విడుదల చేస్తారంటున్నారు. ఈ చిత్రంలో సచిన్ వృత్తి జీవితంలో ఎత్తుపల్లాలు, ఆయన వ్యక్తిగత విషయాలు, చిన్నప్పటి నుండి అంజలితో ప్రేమ, పెళ్లి వరకు అన్ని అంశాలు ఉంటాయంటున్నారు.

Sachin to star as Tendulkar in new movie

అయితే, ఈ చిత్రంలో తన పాత్రను సచిన్ టెండుల్కరే పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. 200 నాటౌట్ అనే ముంబైకి చెందిన సంస్థ ఇప్పటి వరకు 150 అడ్వర్డైజ్‌మెంట్లను, పలు షార్ట్ ఫిలింలను తీసిన క్రెడిట్ దక్కించుకుంది. సినిమా హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యూఎస్‌జీ) తీసుకోనుందని తెలుస్తోంది.

కాగా, సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్ర మీద వచ్చే సినిమాకు లండన్‌కు చెందిన ప్రముఖ రచయిత, దర్శక, నిర్మాత జేమ్స్ ఎరిక్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 200 నాటౌట్ అనే సంస్థకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌తోను మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు ఈ చిత్రంలో నటించవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+