రెండు గంటలు కష్టపడినా అవ్వలేదు: సచిన్(వీడియో)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ పూర్తిగా మద్దతు తెలిపాడు. మొన్న చీపురు పట్టి ముంబై రోడ్లను శుభ్రం చేసిన ఈ మాజీ క్రికెటర్.. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సహచర క్రీడాకారులను ఆహ్వానించాడు.
జహీర్ ఖాన్, సైనా నెహ్వాల్, సర్దార్ సింగ్.. తదితరునుద్దేశించి ట్విట్టర్ ద్వారా సందేశాన్ని పంపాడు. అంతే కాదు స్వచ్చ భారత్, సచ్ భారత్ అన్న సందేశాన్ని అందరికీ చేరేలా చూడాలని వారికి సూచించాడు. తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియోని ఉంచాడు.

అందులో మిత్రులతో కలిసి బాంద్రా బస్టాండ్‌ను తానెలా శుభ్రం చేసిందీ వివరించాడు. "తెల్లారేసరికే శుభ్రం చేయాల్సిన ప్రాంతానికి చేరుకున్నాం. రెండు గంటలు కష్టపడినా సగం పని కూడా పూర్తి చేయలకేపోయాం. కొంత సమయం తర్వాత అక్కడున్న రిక్షా డ్రైవర్లు మాతో చేయి కలిపారు. తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న గోడకు రంగులేశాం. పోలీసులు, మున్సిపల్ అధికారులు కూడా సహకరించారు" అని మీడియాలో సచిన్ వివరించాడు.
ఇంకా ఇలాంటి కార్యక్రమాలు తాను చేపడతానని, అందరూ ఈ వీడియోను చూడాలని విజ్ఞప్తి చేశాడు. గాంధిజీ కలను సాకారం చేసేందుకు.. ప్రధాని నరేంద్ర మోడీ రూపొందించిన కార్యక్రమంలో తను పాలుపంచుకోవడం ఆనందంగా ఉన్నదని సచిన్ అన్నారు.

Swachh Bharat Hi Sach Bharat Hai! The story of Stinky Path to Footpath on film….. http://t.co/TzvYNgSlL9
— sachin tendulkar (@sachin_rt) October 9, 2014

Post by Sachin Tendulkar.

Click it and Unblock the Notifications