రాజ్యసభ: సచిన్ ఆటోగ్రాఫ్ కోసం ఎంపీల క్యూ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత సచిన్ టెండూల్కర్ తొలిసారి రాజ్యసభకు వచ్చాడు. అందరి కళ్లూ సచిన్ టెండూల్కర్‌పై పడ్డాయి. రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ చెక్ షర్ట్, నల్లటి పుల్లోవర్ వేసుకుని సభకు వచ్చాడు. సభ సమావేశానికి కావడానికి కొద్ది సమయం ముందు చైర్మన్ చేంబర్ నుంచి సభలోకి నడిచి వచ్చాడు.

తన సీటు వద్దకు చేరుకోవడానికి వచ్చినప్పుడు సభ్యులు చాలామంది అతనికి అభివాదం చేశారు. పన్నెండేళ్ల క్రితం పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టడంలో ప్రాణాలర్పించినవారికి సభ నివాళులు అర్పించింది. ఆ వెంటనే రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ - నామినేటెడ్ సభ్యుడు, అద్భుతమైన క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం గర్వకారణమని అభినందించారు.

Sachin Tendulkar

తన తరఫున, సభ తరఫున ఆయన టెండూల్కర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. హమీద్ అన్సారీ శుభాకాంక్షలు తెలిపిన సమయంలో సభ్యులు బల్లలపై చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. చేతుల జోడించి వారు శుభాకాంక్షలను సచిన్ టెండూల్కర్ స్వీకరించాడు.

Sachin Tendulkar

ప్రతి సభ్యుడితో కరచాలనం చేస్తూ సచిన్ టెండూల్కర్ వారి అభినందనలు అందుకున్నాడు. శుభాకాంక్షలు తెలపడంతో సభ్యులు సరిపుచ్చలేదు. నామినేటెడ్ మెంబర్ అను ఆగా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నరాు. మణిశంకర్ అయ్యర్ కూడా సచిన్ టెండూల్కర్ సందేశాన్ని అడిగారు. సచిన్ టెండూల్కర్ ఇంతకు ముందు వర్షాకాలం సమావేశాల సందర్భంగా సభకు వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+