అంబానీ ‘బాంబు’కేసులో మరో ట్విస్ట్ -సచిన్ వాజేకు సహకరించిన పోలీస్ రియాజ్ అరెస్ట్

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు, వ్యాపారి మన్ సుఖ్ హిరేన్ హత్య కేసులకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సస్పెండైన ముంబై పోలీస్‌ అధికారి సచిన్‌ వాజ్‌కు సహకరించిన ముంబై పోలీస్‌ రియాజ్ ఖాజీని ఎన్‌ఐఏ ఆదివారం అరెస్ట్‌ చేసింది.

ఫిబ్రవరి 25న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసు, ఆ కారుకు సంబంధించిన వ్యాపారి మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుండటం తెలిసిందే. ఈ రెండు కేసులతో సంబంధం ఉన్న ముంబై క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు చెందిన సచిన్‌ వాజ్‌ను మార్చి 13న ఎన్ఐఏ అరెస్టు చేయగా, తాజాగా అతని అనుచరుణ్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.

 Sachin Vazhe’s associate API Riyazuddin Kazi arrested by NIA in ambani bomb, Mansukh case

ముఖేశ్ ఇంటి వద్ద పేలుడుపదార్థాలతో నిలిపి ఉంచిన కారు కేసులో సచిన్‌ వాజ్‌కు ముంబై పోలీస్‌ అధికారి రియాజ్ కాజీ సహకరించినట్లుగా ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఈ ఆరోపణలపై ఆదివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సచిన్ వాజే లాగే రియాజ్‌ కూడా ముంబై క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్‌ (ఏపీఐ)గా విధులు నిర్వహిస్తున్నారు. కారులో పేలుడు పదార్థాల కేసు దర్యాప్తులో భాగంగా ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబిర్‌ సింగ్‌తోపాటు 40 మందికిపైగా వ్యక్తులను ఎన్‌ఐఏ ప్రశ్నించింది.

 Sachin Vazhe’s associate API Riyazuddin Kazi arrested by NIA in ambani bomb, Mansukh case

అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల కేసులో నిందితుడైన సచిన్ వాజేను అడ్డం పెట్టుకుని ముంబైలోని పబ్ లు, బార్ లు, ఇతర వ్యాపారుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని ఆదేశించారనే ఆరోపణలపై అనిల్ దేశ్ ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముంబై మాజీ సీపీ పరంబీర్ చేసిన ఆరోపణలపై 15 రోజుల్లోగా దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+