షాక్: కారు తీయమన్నందుకు ఎమ్మెల్యేను కొట్టాడు

ఛండీగఢ్: ఛండీగఢ్‌లో ఓ ఎమ్మెల్యే పైన చేయి చేసుకున్న సంఘటన జరిగింది. ఎమ్మెల్యే పైన చేయి చేసుకున్న వ్యక్తి తాగి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. అడ్డంగా ఉన్న కారును తీయమని చెప్పినందుకు సదరు ఎమ్మెల్యేపై ఆ వ్యక్తి దాడి చేశాడు.

ఛండీగఢ్‌లోని సెక్టార్‌ 9 ప్రాంతంలో జరిగిన సంఘటనను పోలీసులు వివరించారు. కారు పార్కింగ్‌ విషయంలో జలంధర్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే, హాకీ మాజీ ప్రగత్‌ సింగ్‌, సెక్టార్‌ 22కు చెందిన కమల్‌జీత్ సింగ్‌ అనే వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది.

SAD MLA Pargat Singh assaulted by drunk person in Chandigarh

రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పక్కకు తీస్తే పార్కింగ్‌ నుంచి తన కారును తెచ్చుకుంటానని ఎమ్మెల్యే ప్రగత్.. కమల్‌జీత్‌ను కోరాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. దీంతో మద్యం మత్తులో ఉన్న కమల్‌జీత్‌ సింగ్‌.. ప్రగత్ పైన దాడి చేశాడు.

ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రగత్‌ వేలికి గాయమైంది. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు కమల్‌జీత్‌ను అరెస్టు చేసి, అనంతరం బెయిల్ పైన విడుదల చేశారు. ప్రగత్ సింగ్ అకాలీదళ్ ఎమ్మెల్యే. ఇతను జలంధర్ కంటోన్మెంట్ నుంచి గత ఎన్నికల్లో గెలుపొందారు. ఇతను మాజీ హాకీ కెప్టెన్ కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+