మంత్రి కొడుకు కేసు: నటిపై నో రేప్, అంగీకారంతో సెక్స్!

బెంగళూరు: రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ పైన నటి మైత్రేయ కేసు పెట్టిన విషయం తెలిసిందే. మెడికల్ రిపోర్టులో ఆమె పైన ఎలాంటి అత్యాచారం జరగలేదని తేలినట్లుగా సమాచారం. బలవంతంగా అత్యాచారం చేసినట్లుగా నివేదికలో వెల్లడి కాలేదని ప్రచారం జరుగుతోంది.

అయితే, మైత్రేయ పరస్పర అవగాహనతో ఫిజికల్ రిలేషన్‌షిప్ కొనసాగించినట్లుగా వెల్లడయింట. కాగా, నటి మైత్రేయ ఎవరితో ఫిజికల్ రిలేషన్‌షిప్ కలిగి ఉందో తెలియరాలేదట. మైత్రేయ గత రెండు నెలలుగా ఫిజికల్ రిలేషన్‌షిప్ కలిగి ఉన్నట్లు వెల్లడియిందని తెలుస్తోంది.

మైత్రేయ పైన బలవంతంగా అత్యాచారం జరగలేదని డాక్టర్ అంబేడ్కర్ కాలేజ్ మెడికల్ వైద్యులు తేల్చినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను వైద్యులు ఆర్టీ నగర్ పోలీసులకు అందచేశారు. మరోవైపు, కార్తీక్ గౌడను ప్రశ్నించేందుకు పోలీస్ టీం ఏర్పాటయింది. ఇదిలా ఉండగా.. కార్తీక్ గౌడ్ మరోసారి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

మైత్రేయ

మైత్రేయ

ప్రేమ-పెళ్లి-మోసం ఆరోపణల నేపథ్యంలో పరారీలో ఉన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్తిక్‌ గౌడకు బెంగళూరు పోలీసులు సోమవారం అల్టిమేటం ఇచ్చారు.

 మైత్రేయ

మైత్రేయ

బుధవారంలోగా లొంగిపోకపోతే అరెస్టు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ప్రేమ పేరిట తనను పెళ్లి చేసుకుని, మరో యువతితో నిశ్చితార్థం చేసుకుంటున్నాడంటూ వర్ధమాన నటి మైత్రేయి గౌడ శుక్రవారం ఆర్‌.టి.నగర్‌ పోలీసులకు ఫిర్యా దు చేసిన సంగతి తెలిసిందే.

 మైత్రేయ

మైత్రేయ

మైత్రేయి ఫిర్యాదు నేపథ్యంలో శుక్రవారంనాడే కార్తీక్‌ గౌడ నివాసానికి పోలీసులు నోటీసులు పంపగా అతడు అదృశ్యమయ్యాడు. అటుపైన ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించగా దీనిపై ఈ నెల 4న విచారణ జరగనుంది. ఈ లోగానే అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్న పోలీసులు, తాజా హెచ్చరిక జారీచేశారు.

 మైత్రేయ

మైత్రేయ

శుక్రవారంనాడు మైత్రేయిని పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. బుధవారం సదానంద తనయుడికి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో మైత్రేయి బెంగళూరులో తీవ్ర ఆరోపణలు చేసింది.

మైత్రేయ

మైత్రేయ

తనను కార్తీక్ గౌడ పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం జరుపుకుంటున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిని సదానంద కుట్రగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+