Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist: లవ్ మ్యారేజ్, భార్యకు మతం మార్చి బుర్కా వేసి టార్చర్, గ్రౌండ్ లో కొడవలితో 23 సార్లు నరికేసి !

బెంగళూరు/ గదగ్: ముస్లీం యువకుడు, హిందూ యువతి ప్రేమించుకున్నారు. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ముస్లీం యువకుడిని పెళ్లి చేసుకోవడానికి వీలులేదని అమ్మాయి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. తల్లిదండ్రులను ఎదిరించి ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేసింది. దంపతులకు ఓ బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తరువాత భర్త అసలు స్వరూపం తెలుసుకున్న భార్య షాక్ అయ్యింది. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్త ఆమెను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశాడు. కొంతకాలానికి ఆమె బుర్కా వేసుకుంటేనే బయటకు వెళ్లాలని షరతులు పెట్టాడు. భర్త పెడుతున్న టార్చర్ తట్టుకుని ఆమె భర్త ఇంట్లోనే ఉండిపోయింది. ప్రేమ వివాహం చేసుకున్న ఆమె పుట్టింటికి వెళ్లలేకపోయింది.

రానురాను భర్త ఆగడాలు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో భార్యకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తనకంటే ముందే తన భర్త ఓ ముస్లీం మహిళను వివాహం చేసుకున్నాడని, వారికి పిల్లలు కూడా ఉన్నారని, తాను రెండో భార్య అని తెలుసుకుంది, భర్త టార్చర్ తట్టుకోలేక ఆమె తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని చివరికి పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో భార్య దూరం అయ్యిందని ఆమె భర్త రగిలిపోయాడు. గ్రౌండ్ లో స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న రెండో భార్య మీద ఆమె భర్త కొడవలితో 23 సార్లు నరికేయడం కలకలం రేపింది.

 ముస్లీం యువకుడు, హిందూ అమ్మాయి

ముస్లీం యువకుడు, హిందూ అమ్మాయి

కర్ణాటకలోని గదగ్ లో అపూర్వా పురాణిక్ అలియాస్ అపూర్వా అనే యువతి నివాసం ఉంటున్నది. కర్ణాటకలోని హుబ్బళిలో ఇజాజ్ శిరూర్ అలియాస్ ఇజాజ్ పాషా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇజాజ్, అపూర్వాకు పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత అపూర్వా, ఇజాజ్ ప్రేమించుకున్నారు.

 నాటకాలు ఆడిన కేటుగాడు పెళ్లి చేసుకున్నాడు

నాటకాలు ఆడిన కేటుగాడు పెళ్లి చేసుకున్నాడు

కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న ఇజాజ్, అపూర్వా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ముస్లీం యువకుడు ఇజాజ్ ను పెళ్లి చేసుకోవడానికి వీలులేదని అపూర్వాకు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. తల్లిదండ్రులను ఎదిరించిన అపూర్వా ఆమె ప్రియుడు ఇజాజ్ ను పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేసింది. పెళ్లి జరిగే వరకు ఇజాజ్ ఏమాత్రం అనుమానం రాకుండా అతని ప్రియురాలు అపూర్వా దగ్గర నటకాలుఆడాడు.

 మతం మార్చి... బుర్కా వేసి సినిమా చూపించిన భర్త

మతం మార్చి... బుర్కా వేసి సినిమా చూపించిన భర్త

ఇజాజ్, అపూర్వా దంపతులకు ఓ బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తరువాత భర్త ఇజాజ్ అసలు స్వరూపం తెలుసుకున్న అతని భార్య అపూర్వా షాక్ అయ్యింది. హిందూ అమ్మాయి అపూర్వాని పెళ్లి చేసుకున్న ఇజాజ్ ఆమెను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశాడు. అపూర్వా పేరును అర్పా బానుగా మార్చేశాడు. కొంతకాలానికి అపూర్వా బుర్కా వేసుకుంటేనే బయటకు వెళ్లాలని ఆమె భర్త ఇజాజ్ షరతులు పెట్టాడు. భర్త ఇజాజ్ పెడుతున్న టార్చర్ తట్టుకున్న అపూర్వా ఆమె భర్త ఇంట్లోనే కుమిలిపోయి కొంతకాలం గడిపింది.

 మొదటి భార్య కాదు.... రెండో భార్య అని తెలిసి షాక్

మొదటి భార్య కాదు.... రెండో భార్య అని తెలిసి షాక్

ప్రేమ వివాహం చేసుకున్న అపూర్వా భర్త ఇజాజ్ పెట్టే టార్చర్ తట్టుకోలేక, ఆమె పుట్టింటికి వెళ్లలేక కుమిలిపోయింది. రానురాను భర్త ఇజాజ్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో అపూర్వాకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తనకంటే ముందే తన భర్త ఇజాజ్ ఓ ముస్లీం మహిళను వివాహం చేసుకున్నాడని, వారికి పిల్లలు కూడా ఉన్నారని, తాను రెండో భార్య అని తెలుసుకుంది,

 విడాకులు ఇవ్వాలని భార్య డిసైడ్

విడాకులు ఇవ్వాలని భార్య డిసైడ్

ఇదే విషయంలో అపూర్వా ఆమె భర్త ఇజాజ్ కు విడాకులు ఇవ్వడానికి సిద్దం అయ్యింది. అయితే రెండో భార్య అపూర్వాకు విడాకులు ఇవ్వడానికి ఇజాజ్ నిరాకరించాడు. ఇదే విషయంలో ఇజాజ్, అపూర్వా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త ఇజాజ్ టార్చర్ తట్టుకోలేక అపూర్వా ఆమె తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని చివరికి నాలుగు నెలల క్రితం గదగ్ లోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

 వేట కొడవలితో భార్యను 23 సార్లు నరికేసిన భర్త

వేట కొడవలితో భార్యను 23 సార్లు నరికేసిన భర్త

రెండో భార్య అపూర్వా దూరం అయ్యిందని ఆమె భర్త ఇజాజ్ రగిలిపోయాడు. గదగ్ లోని లయన్ స్కూల్ గ్రౌండ్ లో స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న రెండో భార్య అపూర్వా మీద ఆమె భర్త ఇజాజ్ కొడవలితో 23 సార్లు నరికేయడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన అపూర్వా గదగ్ జీమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నది. విషయం తెలుసుకున్న గదగ్ ఎస్పీ శివప్రకాష్ ఆసుపత్రి చేరుకుని అపూర్వా నుంచి వివరాలు సేకరించారు. భార్య అపూర్వాను దారుణంగా నరికేసిన ఇజాజ్ తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+