Sadist: విదేశాల్లో ఉద్యోగం, సెలవుల్లో వచ్చి కన్న కూతురిని గర్బతిని చేశాడు, ప్రియుడి మీద కేసు!
కొచ్చి/ కన్నూర్: భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రాంతంలో సమాజం తల దించుకుని సంఘటన వెలుగు చూసింది. విదేశాల్లో ఉంటున్న తండ్రి కుటుంబ సభ్యులను చూడటానికి సొంతఊరికి వచ్చి వెలుతున్న సమయంలో కన్న కూతురి మీద కన్నేశాడు. ఆ కామాంధుడు పదేపదే కూతురిపై అత్యాచారం చేశాడు.
భారత్ కు వచ్చిన తరువాత లాక్ డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉంటున్న తండ్రి కన్న కూతురిని గర్బవతిని చేశాడు. తన మీద ఎక్కడ కేసు పెడుతారో అనే ఆందోళనతో కుమార్తెను బెదిరించిన తండ్రి ఆమె సన్నిహితంగా ఉంటున్న వేరే అబ్బాయి మీద అత్యాచారం కేసు పెట్టించాడు. అయితే బాలిక ధైర్యంగా జరిగిన విషయం బయటకు చెప్పడంతో పోలీసులు, బంధువులు షాక్ కు గురైనారు.

విదేశాల్లో తండ్రి
కేరళలోని సముద్రతీర ప్రాంతంలోని కన్నూరు జిల్లాలోని పంబా పురమట్టూర్ లో 13 ఏళ్ల బాలిక నివాసం ఉంటున్నది. బాలిక తల్లి, ఆమె కుటుంబ సభ్యులు కన్నూరులోనే నివాసం ఉంటున్నారు. బాలిక తండ్రి ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. సంవత్సరానికి ఒక్కసారి కన్నూరు చేరుకుంటున్న తండ్రి నెల, రెండు నెలల పాటు సొంతఊర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ తరువాత విదేశాలకు వెళ్లిపోతున్నాడు.

లాక్ డౌన్ లో కూతురిపై అత్యాచారం
లాక్ డౌన్ కు రెండు నెలల ముందు కన్నూరుకు చేరుకున్న తండ్రి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేని సమయంలో తన సొంత 13 ఏళ్ల కుమార్తెను తండ్రి లైంగిక వేధింపులకు గురి చేశాడు. తనకు దూరంగా ఉంటున్న తండ్రి తన మీద ప్రేమతో అలా చేస్తున్నాడని కొంతకాలం కుమార్తె అనుకుంది. అయితే ఓ రోజు రాత్రి కుమార్తెపై కామాంధుడు అత్యాచారం చేశాడు.

డాక్టర్ల రిపోర్టుతో షాక్
లాక్ డౌన్ సందర్బంగా కన్నూరులోనే ఉండిపోయిన కామాంధుడైన తండ్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కూతురి మీద పదేపదే అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని కుమార్తెను బెదిరించాడు. ఇటీవల బాలిక శరీరంలో అనేక మార్పులు రావడంతో ఆమె తల్లి హడలిపోయింది. రానురాను అమ్మాయికి కడుపు ఎత్తుగా రావడంతో ఆమె తల్లి ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లింది. బాలికకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు మీ అమ్మాయి 6 నెలల గర్బవతి అని చెప్పడంతో ఆమె తల్లితో పాటు బంధువులు షాక్ కు గురైనారు.

చంపేస్తానని బెదిరించిన తండ్రి
నీమీద నేను అత్యాచారం చేశానని నీ తల్లికి, పోలీసులకు, లేదా బంధువులకు చెబితే నిన్ను చంపేసి సముద్రంలో శవాన్ని విసిరేస్తానని కామాంధుడు సొంత కూతురిని బెదిరించాడు. తన కుమార్తె గర్బవతి అయ్యిందని తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. 10వ తరగతి చదువుతూ తన ఇంటికి వచ్చి వెళ్లే 10వ తరగతి చదువుతున్న తన 16 ఏళ్ల బంధువు తన మీద అత్యాచారం చేశాడని బాలిక మొదట పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది.

ఎక్కడో తేడా వస్తోంది
పోలీసులు బాలికను వేరుగా, అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడిని వేరుగా విచారణ చేసి వారి స్టేట్ మెంట్ లు నమోదు చేశారు. బాలిక చెప్పిన సమాచారానికి, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు చెబుతున్న సమాచారినికి పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఎక్కడో ఏదో తేడా వస్తోంది ?, అసలు ఏం జరిగింది ? అంటూ ఆరా తీశారు.

నా తండ్రే కామాంధుడు
బాలికతో ఆమె తల్లి, మహిళా పోలీసులు, బంధువులు నెమ్మదిగా మాట్లాడి ఏం జరిగింది అంటూ ఆరా తీశారు. తన తండ్రి తన మీద పదేపదే అత్యాచారం చెయ్యడం వలనే తాను గర్బవతి అయ్యాయని బాలిక చెప్పడంతో అందరూ షాక్ కు గురైనారు. తన మీద పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించాడని, అందుకే తన బంధువు తన మీద అత్యాచారం చేశాననితప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చానని బాలిక పోలీసులకు చెప్పింది.

పోస్కో కేసుతో కామాంధుడు ఔట్
పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన కన్నూరు జిల్లా పోలీసులు బాలిక తండ్రిని అరెస్టు చేసి కన్నూరు జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టులో బాలిక వివరాలతో పాటు ఆమె తండ్రి పేరు, వివరాలు కోర్టులో వెళ్లడించారు. అయితే బాలిక జీవితనం నాశనం కాకుండా ఉండటానికి ఆమె తండ్రి పేరు కోర్టులో మాత్రమే చెప్పామని, మీడియాకు, బహిరంగంగా కామాంధుడి పేరు చెప్పకూడదని నిర్ణయించామని కన్నూరు పోలీసు అధికారులు తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications