Sadist: నాలుగేళ్లుగా కూతురి మీద అత్యాచారం, పెళ్లి ఆపేశాడు, పక్కాస్కెచ్ తో పిలిపించిన వదిన !
బెంగళూరు/ శివమొగ్గ: వివాహం చేసుకున్న దంపతులకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యాపారం చెయ్యడానికి భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఇంట్లో వ్యాపారి భార్య, ఆమె పిల్లలను ఉంటున్నారు. వ్యాపారం చేస్తున్న భర్త డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. వయసుకు వస్తున్న కూతురి మీద కన్ను వేసిన తండ్రి ఆమెతో చనువుగా ఉన్నట్లు నటించాడు. కన్నతండ్రి కావడంతో కూతురు కూడా మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కూతురిని ఒడిలో కుర్చోబెట్టుకుంటున్న తండ్రి ఆమె శరీరం మీద ఎక్కడంటే అక్కడ చేతులు వెయ్యడం మొదలు పెట్టాడు. చివరికి కన్న కూతురి మీద అత్యాచారం చేసిన తండ్రి ఆమెను లొంగదీసుకున్నాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. నాలుగు సంవత్సరాల నుంచి కన్న కూతురి మీద ఆమె తండ్రి అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. అమ్మాయి ఆ టార్చర్ తట్టుకోలేక తల్లికి చెప్పింది. తల్లికూడా భర్తను ఏమీ చెయ్యలేకపోయింది. ఇటీవల అమ్మాయికి పెళ్లి చేసి తన భర్త నుంచి కాపాడాలని తల్లి అనుకుంది. కూతురి పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయింది. కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతా ఉందని రగిలిపోయిన తండ్రి జీవితాంతం నువ్వు నాకు మాత్రమే పడక సుఖం ఇవ్వాలని, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీళ్లేదని, పెళ్లి చేసుకుంటే చంపేస్తానని కసాయి తండ్రి అతని కూతురిని బెదిరించాడు. అమ్మాయి పెద్దమ్మ ఎంట్రీ ఇచ్చి కామాంధుడైన మరిదిని పక్కాప్లాన్ తో ఇంటికి పిలిపించుకుని కామాంధుడికి ఏం చెయ్యాలో అదే చేసింది.

వ్యాపారం చేస్తున్న భర్త
కర్ణాటకలోని హావేరి జిల్లాలోని హిరకేరూరు తాలుకాలోని లింగాపుర గ్రామంలో గోనప్ప (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకున్న గోనప్ప, కాంతమ్మ (పేరు మార్చడం జరిగింది) దంపతులకు 18 ఏళ్ల వయసు ఉన్న కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యాపారం చెయ్యడానికి గోనప్ప ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఇంట్లో వ్యాపారి గోనప్ప భార్య కాంతమ్మ, ఆమె పిల్లలు ఉంటున్నారు.

కూతురి మీద కన్ను వేసిన కామాంధుడు
సొంఠి, అల్లం వ్యాపారం చేస్తున్న గోనప్ప డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. వయసుకు వస్తున్న కూతురి మీద కన్ను వేసిన గోనప్ప కూతురితో చనువుగా ఉన్నట్లు నటించాడు. కన్నతండ్రి కావడంతో కూతురు కూడా మొదట్లో తండ్రి గోనప్ప చేష్టల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కొడుకుల కంటే కూతురు అంటే గోనప్పకు ఎక్కువ ఇష్టం అని అతని భార్య కాంతమ్మ, కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు.

కూతురి మీద అత్యాచారం చేసిన తండ్రి
కూతురిని ఒడిలో కుర్చోబెట్టుకుంటున్న గోనప్ప ఆమె శరీరం మీద ఎక్కడంటే అక్కడ చేతులు వెయ్యడం మొదలు పెట్టాడు. చివరికి కన్న కూతురి మీద అత్యాచారం చేసిన గోనప్ప ఆమెను లొంగదీసుకున్నాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని గోనప్ప అతని కూతురిని బెదిరించాడు. నాలుగు సంవత్సరాల నుంచి కన్న కూతురి మీద ఆమె తండ్రి గోనప్ప నిరంతరం అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.

టార్చర్ తట్టుకోలేక తల్లికి చెప్పిన కూతురు
రానురాను గోనప్ప అతని కూతురి మీద పడి కామం తట్టుకోలేక ఆమెను చంపేస్తానని బెదిరించి ఆమెను అనుభవించడం మొదలుపెట్టాడు. అమ్మాయి ఆ టార్చర్ తట్టుకోలేక ఆమె తల్లి కాంతమ్మకు చెప్పింది. తల్లి కాంతమ్మ కూడా భర్త గోనప్పను ఏమీ చెయ్యలేక, ఆవేదరతో కుమిలిపోతున్న కూతురికి న్యాయం చెయ్యలేక కొంతకాలం నుంచి కుమిలిపోయింది.

కూతురి పెళ్లి చెయ్యలని డిసైడ్ అయిన తల్లి
తన కూతురిని పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపించేయాలని, తరువాత తన భర్త గోనప్ప ఆరాచకాల నుంచి కూతురు తప్పించుకుంటుందని కాంతమ్మ అనుకుంది, పుట్టింటి వాళ్లు, బంధువులు సహాయంతో కూతురికి ఓ మంచి పెళ్లి సంబంధం చూసిన కాంతమ్మ 15 రోజుల క్రితమే ఆ అబ్బాయితో కూతురి పెళ్లి నిశ్చితార్థం జరిపించింది.

పెళ్లి చేసుకుంటే చంపేస్తానని చెప్పిన తండ్రి
కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతా ఉందని రగిలిపోయిన గోనప్ప నువ్వు జీవితాంతం నాకు మాత్రమే పడక సుఖం ఇవ్వాలని, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీళ్లేదని, పెళ్లి చేసుకుంటే చంపేస్తానని కసాయి తండ్రి అతని కూతురిని బెదిరించాడు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన కాంతమ్మ ఆమె కూతురు, కొడుకులను పిలుచుకుని శివమొగ్గ జిల్లాలోని గోవిందపురంలోని పుట్టింటికి వెళ్లిపోయింది.

బిడ్డలతో ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయిన తల్లి
నా భర్త ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని, నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని, మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని కాంతమ్మ ఆమె అక్క చంద్రమ్మకు ఫోన్ చేసి చెప్పింది. మీరు ఆత్మహత్యలు చేసుకుంటే ఫలితం ఉండదని, నేను అక్కడికి వస్తున్నానని చంద్రమ్మ ఆమె చెల్లెలు కాంతమ్మకు ధైర్యం చెప్పింది.

అడ్డంగా బుక్కైపోయిన కామాంధుడు
భార్య కాంతమ్మ, కూతురు, కొడుకులు ఇంటి నుంచి వెళ్లిపోయి 15 రోజులు కావడంతో గోనప్పకు అనుమానం వచ్చింది. వెంటనే గోనప్ప అతని భార్య అక్క చంద్రమ్మకు ఫోన్ చేసి అతని భార్య, పిల్లల గురించి అడిగాడు. పుట్టింటిలో ఉన్నారని, నువ్వు వచ్చి పిలుచుకుని వెళ్లాలనని చంద్రమ్మ ఆమె మరిది గోనప్పకు చెప్పింది.

కామాంధుడిని చితకబాది సినిమా చూపించిన స్థానికులు
భార్య, కూతురి కోసం గోనప్ప అత్తారింటికి వెళ్లాడు. ఆ సమయంలో గ్రామస్తులు అందరూ కలిసి కామాంధుడు గోనప్పను చితకబాదేసి ఓ ఇంట్లో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు సంవత్సరాల నుంచి తన తండ్రి తన మీద అత్యాచారం చేస్తున్నాడని కూతురు కేసు పెట్టడంతో శివమొగ్గ పోలీసులు గోనప్పను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications