Sadist: రూ. 10 లక్షలు కాదు, ఎన్ని లక్షలు అయినా ఓకే, నా కొడుకు ?, బిగ్ షాట్ డీల్ !

బెంగళూరు/హుబ్బళి: దపంతులకు పిల్లలు ఉన్నారు. భర్త వ్యాపారం చేస్తున్నాడు. సిటీలో మంచి పలుకుబడి ఉన్న ఆయన వ్యాపారాలు చేస్తూ భారీగా డబ్బులు సంపాధిస్తున్నాడు. తండ్రి సంపాధనతో అతని కొడుకు జులాయిగా తిరుగుతూ స్నేహితులతో కలసి పిచ్పాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొడుకు ఆగడాలతో తల్లిదండ్రులు విసిగిపోయారు. కొడుకును కంట్రోల్ లో పెట్టడానికి అతని తండ్రి, ఆయన బందువులు అనేక ప్రయత్నాలు చేశారు. తరువాత కొడుకు శవమై కనిపించాడు. పోలీసుల విచారణలో కలకలం రేపే విషయాలు వెలుగు చేశాయి. రూ .10 లక్షలు కాదు, ఇంకా ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, వాడు మాత్రం బతకకూడుదు అనే డైలాగ్ బయటకు రావడంతో అందరూ బిత్తరపోయారు.

 ప్రముఖ వ్యాపారి

ప్రముఖ వ్యాపారి

కర్ణాటకలోని హుబ్బళి నగరంలో భరత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. భరత్ దపంతులకు పిల్లలు ఉన్నారు. భరత్ కు అఖిల్ నే కుమారుడు ఉన్నాడు. భరత్ వ్యాపారం చేస్తున్నాడు. హుబ్బళి- ధారవాడ జంట నగరాల్లో మంచి పలుకుబడి ఉన్న భరత్ వ్యాపారాలు చేస్తూ భారీగానే డబ్బులు సంపాధిస్తున్నాడు.

 తండ్రి బిగ్ షాట్.... కొడుకు పక్కా జులాయి

తండ్రి బిగ్ షాట్.... కొడుకు పక్కా జులాయి

తండ్రి భరత్ సంపాధనతో అతని కొడుకు అఖిల్ జులాయిగా తిరుగుతూ స్నేహితులతో కలసి పిచ్పాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మద్యంకు బానిస అయిన అఖిల్ రాత్రి ఎప్పుడో ఇంటికి వెళ్లి నానా హంగామా చెయ్యడం మొదలు పెట్టాడు. మద్యంతో పాటు ఇటీవల అఖిల్ గంజాయికి బానిస అయ్యాడని ఆరోపణలు ఉన్నాయి.

 విసిగిపోయిన తల్లిదండ్రులు

విసిగిపోయిన తల్లిదండ్రులు

రాత్రి ఎప్పుడుపడితే అప్పుడు డ్రగ్స్ మత్తులో ఇంటికి వెలుతున్న అఖిల్ అతని తండ్రి భరత్ తో పాటు తల్లిని చితకబాది వారిని నానా ఇబ్బందులకు గురి చేశాడు. కొడుకు అఖిల్ ఆగడాలతో అతని తల్లిదండ్రులు విసిగిపోయారు. కొడుకు అఖిల్ ను కంట్రోల్ లో పెట్టడానికి అతని తండ్రి భరత్, ఆయన బందువులు అనేక ప్రయత్నాలు చేశారు.

 రూ. 10 లక్షలు డిమాండ్

రూ. 10 లక్షలు డిమాండ్

అఖిల్ తీరుతో అతని తండ్రి భరత్ పూర్తిగా విసిగిపోయాడు. తనకు పరిచయం సల్లావుద్దీన్ అనే వ్యక్తిని కలిసిన భరత్ అతని కొడుకు అఖిల్ ను చంపేయాలని చెప్పాడు. సల్లావుద్దీన్ కారణంగా మహంతేశష్ అనే వ్య్తి భరత్ కు పరిచయం అయ్యాడు. అఖిల్ ను హత్య చెయ్యాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని మహంతేష్, సలావుద్దీన్ చెప్పారు.

 టైమ్ బ్యాడ్..... చిక్కిపోయిన తండ్రి

టైమ్ బ్యాడ్..... చిక్కిపోయిన తండ్రి

రూ .10 లక్షలు కాదు, ఇంకా ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, నా కొడుకు అఖిల్ మాత్రం బతకకూడుదు అని భరత్ సలావుద్దీన్, మహంతేష్ కు చెప్పారు. మద్యం మత్తులో ఉన్న అఖిల్ ను సలావుద్దీన్, మహంతేష్ చంపేశారు. అఖిల్ హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. చివరికి అఖిల్ హత్య కేసులో అతని తండ్రి భరత్ తో పాటు సలావుద్దీన్, మహంతేష్ అరెస్టు కావడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+