Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist: విద్యార్థులను వదిలేసి వాళ్ల అమ్మలకు లైన్ వేసిన హెడ్ మాస్టర్, ఆ వీడియోలు షేర్, క్లైమాక్స్ !

బెంగళూరు/ తుమకూరు: ప్రభుత్వ స్కూల్ లో హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మొదట సక్రమంగా విధులకు హాజరు అయ్యేవాడు. రానురాను సక్రమంగా విధులకు హాజరుకాకుండా బయట జల్సాలు చేసి అతని చేతివాటం చూపించాడు. హెడ్ మాస్టర్ కావడంతో అతన్ని సాటి టీచర్లు ఏమాత్రం ప్రశ్నించలేదని తెలిసింది. అయితే ఇదే సమయంలో హెడ్ మాస్టర్ చేసిన పనికి ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, ఊరి ప్రజలతో పాటు, విద్యాశాఖ అధికారులు హడలిపోయారు. స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల అమ్మల ఫోన్ నెంబర్లు తీసుకున్న హెడ్ మాస్టర్ అతని కామం తీర్చుకోవడానికి ప్రయత్నించాడని వెలుగు చూసింది. ఊర్లో ఉంటున్న కొందరు యువకులు మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్లకు లిక్కర్ పార్టీలు ఇచ్చి లొంగదీసుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకున్నాడు. ఓ అమ్మాయి తల్లికి హెడ్ మాస్టర్ పంపించిన వీడియో, మెసేజ్ లీక్ కావడంతో కామాంధుడి భాగోతం బయటకు వచ్చింది. ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల అమ్మలకు హెడ్ మాస్టర్ ఎలాంటి వీడియోలు షేర్ చేస్తున్నాడు, ఎలాంటి మెసేజ్ లో పెడుతున్నాడు అనే విషయం బయటకు రావడం కలకలం రేపింది.

 ప్రభుత్వ స్కూల్ లో హెడ్ మాస్టర్

ప్రభుత్వ స్కూల్ లో హెడ్ మాస్టర్

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలుకాలోని దోడ్డపట్టి గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ లో సురేష్ అనే వ్యక్తి హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ స్కూల్ లో హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్న సురేష్ అక్కడికి బదిలి అయిన మొదట్లో సక్రమంగా విధులకు హాజరు అయ్యేవాడు. రానురాను సక్రమంగా విధులకు హాజరుకాకుండా బయట జల్సాలు చేసి జీతాలు తీసుకుంటున్నాడు.

 విద్యార్థుల అమ్మలకు మాయమాటలు చెప్పాడు

విద్యార్థుల అమ్మలకు మాయమాటలు చెప్పాడు

హెడ్ మాస్టర్ కావడంతో అతన్ని సాటి టీచర్లు ఏమాత్రం ప్రశ్నించలేదని తెలిసింది. ఇదే సమయంలో స్కూల్ లో చదువుతున్న విద్యార్ధుల అమ్మలతో హెడ్ మాస్టర్ సురేష్ పరిచయం పెంచుకున్నాడు. అందంగా ఉన్న విద్యార్థుల అమ్మలతో మాట్లాడి మీ పిల్లలకు మంచి మార్కులు వేస్తానని, వారిని ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయిస్తానని మాయమాటలు చెప్పిన హెడ్ మాస్టర్ సురేష్ వారి ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు.

 ఫోర్న్ వీడియోలు షేర్.... అసభ్యంగా మెసేజ్

ఫోర్న్ వీడియోలు షేర్.... అసభ్యంగా మెసేజ్

విద్యార్థుల అమ్మల ఫోన్ నెంబర్లు తీసుకుని వారికి సహాయం చేసినట్లు నటించిన హెడ్ మాస్టర్ సురేష్ తరువాత వారికి ఫోర్న్ వీడియోలు షేర్ చేసి అసభ్యంగా మెసేజ్ లు పంపించడం మొదలుపెట్టాడు. హెడ్ మాస్టర్ మీద భర్తలకు ఫిర్యాదు చేస్తే మన పిల్లలకు లేనిపోని సమస్యలు వస్తాయని కొంత మంది మహిళలు సైలెంట్ గా ఉండిపోయారు.

 వీడియో లీక్ తో షాక్

వీడియో లీక్ తో షాక్

ఇటీవల ఓ అమ్మాయి తల్లికి హెడ్ మాస్టర్ ఫోర్న్ వీడియో పంపించి అసభ్యంగా మెసేజ్ చేశాడు. ఓ అమ్మాయి తల్లికి హెడ్ మాస్టర్ సురేష్ పంపించిన వీడియో, మెసేజ్ లీక్ కావడంతో కామాంధుడి భాగోతం బయటకు వచ్చింది. హెడ్ మాస్టర్ సురేష్ చేసిన పనికి ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, ఊరి ప్రజలతో పాటు, విద్యాశాఖ అధికారులు హడలిపోయారు.

 కామం తీర్చుకుంటున్న హెడ్ మాస్టర్

కామం తీర్చుకుంటున్న హెడ్ మాస్టర్

స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల అమ్మల ఫోన్ నెంబర్లు తీసుకున్న హెడ్ మాస్టర్ సురేష్ అతని కామం తీర్చుకోవడానికి ప్రయత్నించాడని వెలుగు చూసింది. ఊర్లో ఉంటున్న కొందరు యువకులు మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్లకు లిక్కర్ పార్టీలు ఇచ్చి లొంగదీసుకుంటున్న హెడ్ మాస్టర్ సురేష్ విద్యార్థుల కుటుంబ సభ్యులు ఎలాంటి గొడవలు చెయ్యకుండా అడ్డం పెట్టుకున్నాడని వెలుగు చూసింది.

 హెడ్ మాస్టర్ కు దూలతీరిపోయింది

హెడ్ మాస్టర్ కు దూలతీరిపోయింది

ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల అమ్మలకు హెడ్ మాస్టర్ సురేష్ పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్నాడని అసభ్యంగా మెసేజ్ లో పెడుతున్నాడని గ్రామస్తులు మధుగిరి, తుమకూరు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు హెడ్ మాస్టర్ సురేష్ ను సస్పెండ్ చేశామని విద్యాశాఖ అధికారి సిద్దప్ప మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+