Sadist: భార్య బాత్ రూమ్, బెడ్ రూమ్ లో ఉంటే వీడియోలు తీసిన భర్త, చెప్పిన మాట వినకుంటే ?, క్లైమాక్స్ !

బెంగళూరు/ శివమొగ్గ: ఇరు కుటుంబాల పెద్లలు యువతి, యువకుడి పెళ్లి చేశారు. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి బాగానే జరిగింది. పెళ్లి సందర్బంగా అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి కొడుక్కి బంగారు నగలు, లక్షల రూపాయల నగదు కట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన సంవత్సరం తరువాత భర్తతో పాటు, అతని కుటుంబ సభ్యులు యువతికి టార్చర్ పెట్టడం మొదలుపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. పెళ్లికి ముందు మీ ఇంట్లో చెప్పిన బంగారు నగలు, నగదు ఇవ్వలేదని, మర్యాదగా పుట్టింటికి వెళ్లి ముందుగా ఇచ్చిన మాట ప్రకారం కట్నం డబ్బులు తీసుకురావాలని ఆమెను బెదిరించారు. చివరికి భర్త అతని భార్య ఏకాంతంగా బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో, బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీశాడు. మర్యాదగా చెప్పిన కట్నం డబ్బులు, బంగారు నగలు తీసుకురాకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి విడాకులు ఇస్తానని బ్లాక్ మెయిల్ చెయ్యడం కలకలం రేపింది.

ఏడాది ముందు పెళ్లి

ఏడాది ముందు పెళ్లి


కర్ణాటకలోని శివమొగ్గలోని రిప్పన్ పేట్ నివాసం ఉంటున్న యువతికి, కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని వెల్ కమ్ గేట్ లో నివాసం ఉంటున్న సల్మాన్ అనే యువకుడికి వివాహం చెయ్యాలని గత ఏడాది ఇరువైపుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇరు కుటుంబాల పెద్లలు యువతి, సల్మాన్ ల పెళ్లి శివమొగ్గలోనే చేశారు. అమ్మాయి, సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి బాగానే జరిగింది.

కట్నం కింద బంగారు నగలు, నగదు

కట్నం కింద బంగారు నగలు, నగదు


పెళ్లి సందర్బంగా అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు సల్మాన్ కు బంగారు నగలు, లక్షల రూపాయల నగదు కట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన సంవత్సరం కూడా పూర్తి కాకుండానే సల్మాన్ తో పాటు, అతని అత్తమామలు సాహీరా, మామ షౌకత్ ఖాన్ తోపాటు వారి కుటుంబ సభ్యులు యువతికి టార్చర్ పెట్టడం మొదలుపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

 తలాక్ చెబుతానని బెదిరించిన భర్త

తలాక్ చెబుతానని బెదిరించిన భర్త


పెళ్లికి ముందు మీ ఇంట్లో చెప్పిన బంగారు నగలు, నగదు ఇవ్వలేదని, మర్యాదగా పుట్టింటికి వెళ్లి ముందుగా ఇచ్చిన మాట ప్రకారం కట్నం డబ్బులు తీసుకురావాలని ఆమెను భర్త సల్మాన్ తో పాటు అత్తమామలు బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా భార్య చెప్పిన మాట వినడం లేదని సల్మాన్ ఇప్పటికే రెండు సార్లు ఆమెకు తలాక్ చెప్పాడని తెలిసింది. అయితే భర్త సల్మాన్ తో పాటు అత్తమామల టార్చర్ భరిస్తూ ఆమె ఇంతకాలం భర్త సల్మాన్ ఇంటిలోనే ఉండిపోయింది.

భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన భర్త

భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన భర్త

భార్య ఎంత టార్చర్ పెట్టినా చెప్పిన మాట వినడం లేదని భర్త సల్మాన్ రెచ్చిపోయాడని సమాచారం. చివరికి సల్మాన్ అతని భార్య ఏకాంతంగా బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో, బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీశాడు. మర్యాదగా చెప్పిన కట్నం డబ్బులు, బంగారు నగలు తీసుకురాకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి విడాకులు ఇస్తానని సల్మాన్ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆమె హడలిపోయి శివమొగ్గలోని పుట్టింటికి వెళ్లిపోయింది.

శాడిస్టు భర్త అరెస్టు

శాడిస్టు భర్త అరెస్టు

తన భర్త సల్మాన్, అత్త సాహీరా, మామ షౌకత్ ఖాన్, ఆడపడుచు సమీనా తనను అదనపు వరకట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని, కట్నం తీసుకురాకపోతే తాను ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నవవధువు శివమొగ్గలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్త సల్మాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+