Sadist: నిండు గర్బిణిని గొంతు చీల్చి చంపేసి అత్తకు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పిన అల్లుడు !

లక్నో/ఘాజియాబాద్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య గర్బవతి అయ్యింది. భార్య గర్బవతి అయిన తరువాత భర్త ఆమె మీద ప్రతాపం చూపించాడు. ఏదో ఒక విషయం అడ్డం పెట్టుకుని భార్యను చితకబాదేస్తున్నాడు. భార్య 8 నెలల గర్బవతి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా కొట్టాడు. వంటగదిలో కత్తి తీసుకుని నిండు గర్బణి అయిన భార్య గొంతు చీల్చి దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసిన తరువాత ఆమె తల్లికి ఫోన్ చేసిన కిరాతకుడు వచ్చి మీ కూతురి శవాన్ని తీసుకెళ్లండి అని చెప్పడం కలకలం రేపింది.

 సంతోషంగా కొంతకాలం కాపురం చేశారు

సంతోషంగా కొంతకాలం కాపురం చేశారు

ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లోని నందగ్రామ్ లో అంకిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన మహిళను 2016 జులై 10వ తేదీన అంకిత్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొంతకాలం అంకిత్ అతని భార్యతో కాపురం చేశాడని తెలిసింది.

 భార్యను టార్చర్ పెట్టాడు

భార్యను టార్చర్ పెట్టాడు

ఘాజియాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో అంకిత్ ఉద్యోగం చేస్తున్నాడు. అంకిత్ భార్య గర్బవతి అయ్యింది. భార్య గర్బవతి అయిన తరువాత అంకిత్ ఆమె మీద ప్రతాపం చూపించాడు. ఏదో ఒక విషయం అడ్డం పెట్టుకుంటున్న అంకిత్ అతని భార్యను చితకబాదేస్తున్నాడు.

 నిండుగర్బిణి భార్యను చంపేసి అత్తకు ఫోన్ చేశాడు

నిండుగర్బిణి భార్యను చంపేసి అత్తకు ఫోన్ చేశాడు

భార్య 8 నెలల గర్బవతి అని కూడా చూడకుండా అంకిత్ ఆమెను దారుణంగా కొట్టాడు. వంటగదిలో కత్తి తీసుకున్న అంకిత్ నిండు గర్బణి అయిన భార్య గొంతు చీల్చి దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసిన తరువాత ఆమె తల్లికి ఫోన్ చేసిన కిరాతకుడు అంకిత్ వచ్చి మీ కూతురి శవాన్ని తీసుకెళ్లండి అని చెప్పడం కలకలం రేపింది.

 వాడు శాడిస్టు భర్త

వాడు శాడిస్టు భర్త

పెళ్లి జరిగినప్పటి నుంచి అల్లుడు అంకిత్ మా కుతురు మొబైల్ ఫోన్ వాడటానికి కూడా వదల్లేదని, భార్య మీద అనుమానంతో అంకిత్ నిత్యం టార్చర్ పెట్టేవాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అదనపుకట్నం కావాలని అంకిత్ నిత్యం మా అమ్మాయిని దారుణంగా హింసించేవాడని బాధితురాలి తల్లిదండ్రులు కేసు పెట్టారని, నిందితుడు అంకిత్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+