Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist: కాలేజ్ కు వెళ్లే కొడుకు ముందే భార్యను చంపేసిన భర్త, అసలు మ్యాటర్, క్లైమాక్స్ !

నోయిడా/న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న దంపతులు వారి కొడుకును బాగా చదివించుకోవాలని అనుకున్నారు. మద్యంకు బానిస అయిన భర్త ఉద్యోగం వదిలేశాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భార్య ఆమె భర్త, కొడుకును పోషిస్తోంది. రాత్రి ఓ విషయంలో దంపతుల మద్య గొడవ మొదలైయ్యింది. రాత్రి దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. కాలేజ్ కు వెళ్లే వయసు ఉన్న కొడుకు ముందే మద్యం మత్తులో ఉన్న భర్త అతని భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

 18 ఏళ్ల క్రితం పెళ్లి

18 ఏళ్ల క్రితం పెళ్లి

కాన్పూర్ లోని గోవింద్ నగర్ లో అజయ్ బదౌరియా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 18 ఏళ్ల క్రితం అజయ్ అతని కుటుంబ సభ్యులు సెట్ చేసిన అనితా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అజయ్, అనితా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కాలేజ్ కు వెలుతున్న ఓ కుమారుడు ఉన్నాడు.

 ఉద్యోగం మానేసి జల్సా చేస్తున్న భర్త

ఉద్యోగం మానేసి జల్సా చేస్తున్న భర్త

నోయిడా చేరుకున్న అజయ్, అనితా దంపతులు సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. అజయ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. అనితా ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తోంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న అనితా, అజయ్ దంపతులు వారి కొడుకును బాగా చదివించుకోవాలని అనుకున్నారు. మద్యంకు బానిస అయిన అజయ్ సంవత్సరం క్రితం ఉద్యోగం మానేశాడు.

 భార్య సంపాదనతో జల్సాలు

భార్య సంపాదనతో జల్సాలు

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అనితా ఆమె భర్త అజయ్, కాలేజ్ కు వెలుతున్న కొడుకును పోషిస్తోంది. మంగళవారం రాత్రి కాలేజ్ లో చేర్పించే విషయంలో అజయ్, అనిత దంపతుల మద్య గొడవ మొదలైయ్యింది. ఆ సందర్బంలో అనితా, అజయ్ ల మద్య మాటామాటా పెరిగిపోవడంతో గొడవ చాలా పెద్దది అయ్యింది.

 ఉద్యోగం మానేస్తానని చెప్పిన భార్య..... పొడిచి చంపేసిన భర్త

ఉద్యోగం మానేస్తానని చెప్పిన భార్య..... పొడిచి చంపేసిన భర్త

ఆ సందర్బంలో నువ్వు కొడుకును మంచి కాలేజ్ లో చేర్పించడానికి అంగీకరించకపోతే నేను కూడా ఉద్యోగం మానేసి ఇంటిలో ఉంటానని, నేను నిన్ను పోషించనని, నీ ఖర్చులకు డబ్బులు ఇవ్వనని అనితా ఆమె భర్త అజయ్ కు తేల్చి చెప్పింది రాత్రి దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. కాలేజ్ కు వెళ్లే వయసు ఉన్న కొడుకు ముందే మద్యం మత్తులో ఉన్న అజయ్ కత్తితో అతని భార్యను ఇష్టం వచ్చినట్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. భార్య అనితను హత్య చేసి పారిపోయిన అజయ్ ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+