Sadist: భార్య వెంటపడి టార్చర్ పెట్టాడు, భర్తకు మ్యాటర్ తెలిసి నిలదీశాడు, శాడిస్టు ఏం చేశాడంటే ?
బెంగళూరు/ బెళగావి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భర్త వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు భర్త లేని సమయంలో అతని భార్యను ఓ యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే విషయంలో గొడవ జరిగింది. బుద్దిమాటలు చెప్పిన భర్త హత్యకు గురి అయ్యాడు. భార్యను వేదిస్తున్నాడని ప్రశ్నించిన భర్త యువకుడి చేతిలో హత్యకు గురి కావడం కలకం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని ఖానాపురాలోని బహేరా ప్రాంతంలో మారుతి జాధవ్ అలియాస్ మారుతి (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 15 సంవత్సరాల క్రితం ఓ మహిళతో మారుతి వివాహం జరిగింది. వివాహం చేసుకున్న మారుతి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు. మారుతి వ్యాపారం చేస్తున్నాడు.

పక్కింటోడి భార్య మీద కన్నుపడింది
వ్యాపారం చేస్తున్న మారుతి ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. మారుతి నివాసం ఉంటున్న ఏరియాలో నివాసం ఉంటున్న ప్రశాంత్ అనే యువకుడు మారుతి భార్య మీద కన్ను వేశాడు. ఒంటరిగా వెలుతున్న మారుతి భార్యను ప్రశాంత్ వేధింపులకు గురి చేశాడు. కొంతకాలంగా మారుతి భార్య ఓపికగా ప్రశాంత్ టార్చర్ తట్టుకుంటూ ఆమె భర్తకు అసలు మ్యాటర్ చెప్పలేదు.

భర్త బుద్దిమాటలు చెప్పాడని ?
రానురాను ప్రశాంత్ టార్చర్ ఎక్కువ అయ్యింది. చివరికి మ్యాటర్ తెలుసుకున్న మారుతి నా భార్య జోలికి రాకూడదని, నువ్వు పద్దతి మార్చుకోవాలని ప్రశాంత్ కు వార్నింగ్ ఇచ్చాడు. నాకే వార్నింగ్ ఇస్తావా ?, నీకు ఎంత ధైర్యం రా అంటూ రెచ్చిపోయిన ప్రశాంత్ కత్తి తీసుకుని మారుతిని హత్య చేశాడు. భార్యను వేదిస్తున్నాడని ప్రశ్నించిన భర్త యువకుడి చేతిలో హత్యకు గురి కావడం కలకం రేపింది.












Click it and Unblock the Notifications