Sadist lover: పెళ్లికి ముందు మాజీ ప్రియురాలి నగ్న వీడియోలు షేర్, చేతులు ఎత్తేసిన పెళ్లికొడుకు !
బెంగళూరు/మైసూరు/మండ్య: ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నదని ప్రియుడు శాడిస్టు అయ్యాడు. కులాలు వేరైనా యువతి, యువకుడు ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రేమికులను పెద్దలు మందలించి కులాంతర వివాహం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని బెదిరించారు. అమ్మాయికి నచ్చచెప్పి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేశారు. అప్పటి నుంచి ప్రియుడు తనకు శారీర సుఖం ఇవ్వాలని, లేదంటే ఇద్దరు సన్నిహితంగా, ఏకాంతంగా తీసుకున్న సీక్రెట్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని, కాబోయే వరుడికి పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేసి చివరికి అన్నంతపని చేశాడు. ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది.

మైసూరు లవర్స్
కర్ణాటకలోని మైసూరు సమీపంలోని నంజనగూడు తాలుకా మెల్లహళ్ళిలో మేఘనా (20), మణికంఠ అనే యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి మేఘనా, మణికంఠ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన మేఘనా, మణికంఠ చాలా కాలం సంతోషంగా ఉన్నారు.

మీకు ఓకే.... మీ పిల్లల పరిస్థితి ఏమిటి ?
మేఘనా, మణికంఠ కులాలు వేరు. మణికంఠ కంటే మేఘనా ఎక్కువ కులానికి చెందినది. తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించామని, మీరు అంగీకరించాలని మేఘనా, మణింకఠ వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. మీరు పెళ్లి చేసుకుంటే మీ కులాలు వేర్వేరు అని మీ పిల్లలను ఎవ్వరూ పెళ్లి చేసుకోరని, మీరు మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోరాదని మేఘనా, మణికంఠకు వారి పెద్దలు మెదడు వైట్ వాష్ చేసి మనసులు మార్చడానికి ప్రయత్నించారు. .

నీ జీవితం.... నువ్వే ఆలోచించుకో
మణికంఠను మరిచిపోవాలని మేఘనాకు ఆమె తల్లిదండ్రులు నచ్చచెప్పారు. మేము చెప్పిన చోట నువ్వు వివాహం చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటావని, లేదంటే సమస్యలు ఎదురౌతాయని మేఘనాకు చెప్పారు. మేఘనా మనసు మార్చిన ఆమె తల్లిదండ్రులు వారి కులానికే చెందిన మరో యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిపించారు.

నాతో ఎంజాయ్ చెయ్యాలి.... లేదంటే ?
మేఘనా నిశ్చితార్థం జరిగిపోయే వరకు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సైలెంట్ గా ఉన్న మణికంఠ తరువాత అతని అసలు స్వరూపం బయటపెట్టాడు. తనకు శారీర సుఖం ఇవ్వకపోతే ఇద్దరూ ఏకంతంగా, కలిసిమెలసి ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని ప్రియురాలు మేఘనాను బెదిరించాడు.

చేతులు ఎత్తేసిన పెళ్లి కొడుకు
శారీరక సుఖం అందివ్వడానికి మేఘనా నిరాకరించింది. అయితే ప్రియురాలి మేఘనాను ఎంత బ్లాక్ మెయిల్ చేసినా ఆమె లొంగకపోవడంతో ఆమెకు కాబోయే భర్తకు ఇద్దరూ కలిసి ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు పంపించాడు. కాబోయే భర్త మణికంఠ, మేఘనా కలిసి తీసుకున్న ఫోటోలు చూసి నాకు ఈ పెళ్లి వద్దు అని తేల్చి చెప్పాడు.
Recommended Video

శాడిస్టు లవర్ టార్చర్
మాజీ ప్రియుడు మణికంఠ చేసిన పనికి తన పెళ్లి ఆగిపోయిందని జీవితంపై విరక్తి పెంచుకున్న మేఘనా విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మేఘనా ఆత్మహత్యకు మణికంఠ కారణం అని మేఘనా తండ్రి మహదేవయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రియురాలి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయిన శాడిస్టు లవర్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి జల్సాగా తిరుగుతున్నాడు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications