Sadist: బీడీతో భార్యను ఎక్కడెక్కడ కాల్చాడంటే ?, కళ్లు కూడా వదల్లేదు, అపార్ట్ మెంట్ లో !
పంచకుల: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. చిన్నచిన్న విషయాలతో మొదట దంపతుల మద్య గొడవలు జరిగేవి. అయితే రానురాను గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను చితకబాదేశాడు. తరువాత బీడీ అంటించిన భర్త అతని భార్య కాళ్లు, చేతులు, శరీరంలోని ఇతరభాగాల్లో కాల్చాడు. రెచ్చిపోయిన భర్త అతని భార్య కళ్లల్లో బీడీతో కాల్చడం కలకలం రేపింది.

కొంతకాలం సంతోషంగానే ఉన్నారు
చంఢీఘర్ లోని పంచకుల సమీపంలోని పింజోర్ ప్రాంతంలో జతిన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన సంగీత అనే యువతిని జతిన్ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొంతకాలం పాటు జతిన్, సంగీత దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిసింది.

గొడవలు చిన్నగా మొదలై తరువాత ?
పింజోర్ లోని అమరావతి అపార్ట్ మెంట్ లో జతిన్, సంగీత దంపతులు కాపురం ఉంటున్నారు. సంగీత, జతిన్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. చిన్నచిన్న విషయాలతో మొదట సంగీత, జతిన్ దంపతుల మద్య గొడవలు జరిగేవి. అయితే రానురాను గొడవలు తారాస్థాయికి చేరడంతో సంగీత హడలిపోయిందని తెలిసింది.

బీడీతో భార్య కళ్లు కాల్చిన భర్త
పెద్దలు నచ్చచెప్పినా జతిన్ మాత్రం అతని భార్య సంగీతను టార్చర్ పెడుతూనే ఉన్నాడు. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన జతిన్ అతని భార్య సంగీతను చితకబాదేశాడు. తరువాత బీడీ అంటించిన జతిన్ అతని భార్య సంగీత కాళ్లు, చేతులు, శరీరంలోని ఇతరభాగాల్లో కాల్చాడు. సంగీత కేకలు వేస్తున్నా జతిన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు.

శాడిస్టు మొగుడు ఎస్కేప్
భార్య సంగీత ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా రెచ్చిపోయిన జతిన్ అతని భార్య సంగీత కళ్లల్లో బీడీతో కాల్చడం కలకలం రేపింది. కళ్లకు తీవ్రగాయాలైన సంగీత ఆసుపత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే శాడిస్టు మొగుడు జతిన్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications