Sadist: పక్కింటి వాళ్లతో రూ. 50 కోసం గొడవ, 18 నెలల బిడ్డను చంపిన సైకో, ఆరు నెలల తరువాత !

ఫరీదాబాద్/ గురుగ్రామ్/చెన్నై: జులాయిగా తిరుగుతున్న యువకుడు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. జులాయిగా తిరుగుతున్న యువకుడు అతని కుటుంభ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లను బెదిరించి వారి దగ్గర డబ్బులు లాక్కొని ఎంజాయ్ చేస్తున్నాడు. మాదకద్రవ్యాలకు బానిస అయిన యువకుడికి డబ్బులు చిక్కకపోవడంతో విలవిలలాడిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు కూడా అతనికి డబ్బులు ఇచ్చి ఇచ్చి విసిగిపోయి అతన్ని దూరం పెట్టారు. 8 సంవత్సరాల అమ్మాయి అంగడితో బిస్కెట్లు తీసుకోవడానికి రూ. 50 తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్న విషయం గుర్తించిన అతను ఆమె దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడు. బాలిక ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు జులాయిని నిలదీశారు. రూ. 50 విషయంలో ఇరు వర్గాల మీద పెద్ద గొడవ జరిగింది. పక్కింటి ఫ్యామిలీ మీద పగ పెంచుకున్న యువకుడు ఎలాగైనా వారికి బుద్ది చెప్పాలని నిర్ణయించాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న పక్కింటి యువకుడి 18 నెలల కుమారుడిని ఎత్తుకెళ్లి వాటర్ ట్యాంక్ లో వేసి జలసమాధి చేసి తప్పించుకుని పారిపోయాడు.

నిరుద్యోగి.... జులాయి

నిరుద్యోగి.... జులాయి


ఫరీదాబాద్ లోని సెక్టార్ 56 లో సురేష్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 22 ఏళ్ల వయసు వచ్చినా సురేష్ ఎలాంటి పనిపాట చెయ్యకుండా జులాయిగా తిరుగుతున్నాడు. జులాయిగా తిరుగుతున్న సురేష్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. జులాయిగా తిరుగుతున్న సురేష్ అతని కుటుంభ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లను బెదిరించి వారి దగ్గర డబ్బులు లాక్కొని ఎంజాయ్ చేస్తున్నాడు.

 డ్రగ్స్ కు బానిస

డ్రగ్స్ కు బానిస

మాదకద్రవ్యాలకు బానిస అయిన సురేష్ డబ్బులు చిక్కకపోవడంతో విలవిలలాడిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు కూడా సురేష్ డబ్బులు ఇచ్చి ఇచ్చి విసిగిపోయి అతన్ని దూరం పెట్టారు. డబ్బులు చిక్కపోవడం, గంజాయి, మద్యం సేవించడానికి డబ్బులు చిక్కపోవడంతో సురేష్ బెదిరించి డబ్బులు లాక్కోవడం మొదలు పెట్టాడు.

 రూ. 50 కోసం పెద్ద గొడవ

రూ. 50 కోసం పెద్ద గొడవ

సురేష్ ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న 8 సంవత్సరాల అమ్మాయి ఇదే సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన అంగడితో బిస్కెట్లు తీసుకోవడానికి రూ. 50 తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్న విషయం గుర్తించిన సురేష్ ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడు. బాలిక ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు సురేష్ ను నిలదీశారు. రూ. 50 విషయంలో సురేష్ కి, బాలిక తండ్రి మద్య పెద్ద గొడవ జరిగింది.

పగ పెంచుకుని పసిబిడ్డను చంపేశాడు

పగ పెంచుకుని పసిబిడ్డను చంపేశాడు

పక్కింటి ఫ్యామిలీ మీద పగ పెంచుకున్న సురేష్ ఎలాగైనా వారికి బుద్ది చెప్పాలని నిర్ణయించాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న పక్కింటి యువకుడి 18 నెలల కుమారుడిని సురేష్ ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా సురేష్ ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ లో 18 నెలల చిన్నారని వేసి జలసమాధి చేసి అదే రోజు తప్పించుకుని పారిపోయాడు.

6 నెలలు ఎస్కేప్

6 నెలలు ఎస్కేప్

బాలుడు కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. బాలుడి కుటుంబ సభ్యులు గాలించడంతో నీటి ట్యాంక్ లో చిన్నారి శవమై కనిపించాడు. బాలుడిని హత్య చేసిన సురేష్ అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా వారానికి ఒక ప్రాంతంలో ఉంటూ ఇంతకాలం తప్పించుకుని తిరిగాడు. చివరికి ఆరు నెలల తరువాత సోమవారం సురేష్ ఉన్న ప్రాంతం గురించి తెలుసుకున్న ఫరీదాబాద్ పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు. 50 రూపాయల కోసం ఓ బిడ్డ ప్రాణం తీసిన సురేష్ పాపం పండిపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడి జైలుపాలైనాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+