Daughter: భర్తకు బాయ్ బాయ్, ప్రియుడితో కాపురం, పెంపుడు కూతురి మీద ?, 5 నెలల్లో 7 సార్లు, శాడిస్టు !

బెంగళూరు/చిక్కమగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చెయ్యడంతో కూతురు పుట్టింది. కొన్ని సంవత్సరాల పాటు భర్తతో కాపురం చేసిన మహిళ తరువాత ఆయనతో తెగతెంపులు చేసుకుని కూతురితో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. భర్తకు దూరం అయిన మహిళ మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మహిళ, ఆ వ్యక్తి సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నారని తెలిసింది. పెంపుడు తండ్రి, తల్లితో కలిసి ఆ అమ్మాయి ఒకే ఇంట్లో ఉంటున్నది. తల్లితో కాపురం చేస్తున్న కామాంధుడు ఆమె కూతురి మీద కన్ను వేశాడు. పెళ్లి వయసుకు వస్తున్న పెంపుడు కూతురిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. తల్లితో కాపురం చేస్తున్న పెంపుడు తండ్రి మీద ఫిర్యాదు చెయ్యడానికి బాలిక మొదట్లో వెనకడుగు వేసింది. బాలిక నిస్సహాయత అలుసుగా తీసుకున్న కామాంధుడు ఆమె మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు. పెంపుడు తండ్రి ఆగడాలు ఎక్కువ కావడంతో ఆ అమ్మాయి ఆమె తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. నాతో కాపురం చేస్తున్న నువ్వు నా కూతురి జోలికి ఎందుకు వస్తున్నావు అంటూ మహిళ ప్రశ్నించడంతో కామాంధుడు ఆమె మీద కూడా దాడి చేశాడు. నేను చెప్పినట్లు విని ఇక్కడే పడి ఉండాలని ప్రియురాలు, ఆమె కూతురి మీద రెచ్చిపోవడంతో అక్కడ కామాంధుడికి అసలు సినిమా మొదలైయ్యింది.

భర్తకు బాయ్ బాయ్ చెప్పిన భార్య

భర్తకు బాయ్ బాయ్ చెప్పిన భార్య


కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని నరసింహరాజపుర తాలుకాలోని బాళేహోన్నూరులో సుమిత్రా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న సుమిత్రా ఆమె భర్తతో కాపురం చెయ్యడంతో కూతురు పుట్టింది. కొన్ని సంవత్సరాల పాటు భర్తతో కాపురం చేసిన సుమిత్రా తరువాత ఆమె భర్తతో తెగతెంపులు చేసుకుని కూతురితో కలిసి వేరుగా నివాసం ఉంటోంది.

ప్రియుడితో నివాసం ఉంటున్న మహిళ

ప్రియుడితో నివాసం ఉంటున్న మహిళ

భర్తకు దూరం అయిన సుమిత్రా క్రిష్ణ (34) అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. సుమిత్రా, క్రిష్ణ కొన్ని సంవత్సరాల క్రితం సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నారని తెలిసింది. పెంపుడు తండ్రి క్రిష్ణ, తల్లి సుమిత్రాతో కలిసి ఆ అమ్మాయి ఒకే ఇంట్లో ఉంటున్నది. తల్లి సుమిత్రాతో కాపురం చేస్తున్న కామాంధుడు క్రిష్ణ ప్రియురాలి కూతురి మీద కన్ను వేశాడు.

పెంపుడు కూతురి మీద లైంగిక దాడి

పెంపుడు కూతురి మీద లైంగిక దాడి

కామాంధుడు క్రిష్ణ పెళ్లి వయసుకు వస్తున్న పెంపుడు కూతురిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. తల్లి సుమిత్రాతో కాపురం చేస్తున్న పెంపుడు తండ్రి క్రిష్ణ మీద ఫిర్యాదు చెయ్యడానికి మైనర్ అమ్మాయి ఇంతకాలం వెనకడుగు వేసింది. బాలిక నిస్సహాయత అలుసుగా తీసుకున్న కామాంధుడు క్రిష్ణ ఆమె మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు.

ఐదు నెలల్లో 7 సార్లు అత్యాచారం ?

ఐదు నెలల్లో 7 సార్లు అత్యాచారం ?

గత ఐదు నెలల నుంచి 7 సార్లు పెంపుడు కూతురి మీద అత్యాచారం చేసిన కామాంధుడు క్రిష్ణ ఈ విషయం నీ తల్లి సుమిత్రాకు చెబితే ఇద్దరిని చంపేసి శవాలు మాయం చేస్తానని బెదిరించాడని తెలిసింది. పెంపుడు తండ్రి క్రిష్ణ ఆగడాలు ఎక్కువ కావడంతో ఆ అమ్మాయి ఆమె తల్లి సుమిత్రాకు జరిగిన విషయం మొత్తం చెప్పింది.

తల్లి, కూతురి మీద దాడి..... బెండ్ తీసిన పోలీసులు

తల్లి, కూతురి మీద దాడి..... బెండ్ తీసిన పోలీసులు

నాతో కాపురం చేస్తున్న నువ్వు నా కూతురి జోలికి ఎందుకు వస్తున్నావు అంటూ సుమిత్రా ఆమె ప్రియుడు క్రిష్ణను ప్రశ్నించింది. రగిలిపోయిన కామాంధుడు క్రిష్ణ బాలిక తల్లి సుమిత్రా మీద కూడా దాడి చేశాడు. నేను చెప్పినట్లు విని ఇక్కడే పడి ఉండాలని ప్రియురాలు సుమిత్రా, ఆమె కూతురి మీద రెచ్చిపోయాడు. సుమిత్రా, ఆమె కూతురు ఫిర్యాదు చెయ్యడంతో ఫోక్సో చట్టం కింద క్రిష్ణను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+