girlfriend: స్క్రూడ్రైవర్ తో మాజీ ప్రియురాలిని 51 సార్లు పొడిచి స్పాట్ లో చంపిన కండెక్టర్ !
ఛత్తీస్ గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో 20 ఏళ్ల మహిళను ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ పంప్ హౌస్ కాలనీలో డిసెంబర్ 24న ఈ హత్య జరిగిందని కోర్బా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశ్వదీపక్ త్రిపాఠి మీడియాకు చెప్పారు. యువతిని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ హత్య చెయ్యడం కలకలం రేపింది.
బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె కేకలు వేయకుండా యువతి నోటిని దిండుతో కప్పిపెట్టి ఆమెను కిందవేసి స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి సోదరుడు ఇంటికి వచ్చి చూడగా అతని సోదరి రక్తపు మడుగులో పడి ఉందని పోలీసు అధికారి తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాకు చెందిన నిందితుడు 3 సంవత్సరాల క్రితం యువతితో స్నేహం చేశాడు. నిందితుడు కొన్ని సంవత్సరాలు బస్సు కండక్టర్ గా పని చేశాడు. ఆసమయంలో ఆ యువతి నిత్యం అతని బస్సులో ప్రయాణించేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారి ఒకరు స్థానిక మీడియాకు చెప్పారు.
తరువాత నిందితుడు పని నిమిత్తం గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెళ్లారు. అప్పుడు కూడా వారిద్దరూ ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉన్నారని పోలీసులు అంటున్నారు. అయితే కొన్ని నెలల నుంచి ఆ యువతి అతడితో ఫోన్ మాట్లాడడం మానేసింది. దీంతో రగిలిపోయిన నిందితుడు ఆమెను, యువతి తల్లిదండ్రులను కూడా ఫోన్ లో, నేరుగా బెదిరించాడని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ హత్య కేసుకు సంబంధించి కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం 4 పోలీసు బృందాలతో గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఢిల్లీలో ప్రియురాలు శ్రద్దాను ఆమె ప్రియుడు హఫ్తా 36 ముక్కలుగా నరికిన విషయం మరిచిపోకముందే ఇప్పుడు యువతిని స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి హత్య చెయ్యడం కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications