Sadist wife: పెళ్లి జరిగిన మూడు నెలలకే భర్త జీవితం ఫినిష్. ఫ్యామిలీ ప్యాకేజ్ టార్చర్, క్లైమాక్స్ లో !
బెంగళూరు/మండ్య: కుటుంబ సభ్యులు ఓ యువతి, యువకుడిని పెళ్లి సెట్ చేశారు. యువతి, యువకుడి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగి నెల రోజులు కూడా భర్త ఇంటిలో కాపురం చెయ్యని కొత్త పెళ్లి కూతురు సిటీకి వెళ్లి పోదామని భర్త మీద ఒత్తిడి చేసింది. కొత్త పెళ్లి కూతురు చెప్పినట్లు తల్లిదండ్రులతో పాటు కుటంబ సభ్యులు అందరిని వదిలేసిన భర్త అతని భార్యతో కలిసి సిటీకి చేరుకున్నాడు. కొత్త ఇంటిలో కూడా భార్య ఆమె భర్తను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ప్రతిరోజు దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేని భర్త పెళ్లి జరిగి వంద రోజులు కూడా పూర్తి కాకుండానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

పెద్దలు సెట్ చేసిన పెళ్లి
కర్ణాటకలోని రామనగర జిల్లాలోని చెన్నపట్టణ తాలుకాలోని కడ్లూరు గ్రామంలో మహేశ్వర్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మండ్య జిల్లాలోని మద్దూరు తాలుకాలోని హోన్నలగరి గ్రామంలో కవన (22) అనే యువతి నివాసం ఉంటున్నది. కుటుంబ సభ్యులు మహేశ్వర్, కవనల పెళ్లి సెట్ చేశారు. మూడు నెలల క్రితం మద్దూరమ్మ దేవాయంలో కవన, మహేశ్వర్ ల వివాహం జరిగింది. ఇదే రోజు రాత్రి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.

నెల రోజులకే బెంగళూరుకు వెళ్లిపోవాలని ?
వివాహం అయిన తరువాత కవన ఆమె భర్త మహేశ్వర్ ఇంటికి వెళ్లింది. ఇంట్లో అత్తమామలు, మరదలు, మరిది ఉంటే ఆమె అక్కడ ఉండలేకపోయింది. పెళ్లి జరిగి నెల రోజులు పూర్తికాకుండానే కవన మనం బెంగళూరు వెళ్లిపోదామని ఆమె భర్త మహేశ్వర్ ను గోకవడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు ఇదే విషయంలో మహేశ్వర్, కవన దంపతుల మ్యద చర్చలు జరిగాయి.

బెంగళూరులో కూడా సేమ్ టార్చర్
కొత్తగగా పెళ్ి చేుకున్న మహేశ్వర్ అతని భార్య కవన కోరిక మేరకు బెంగళూరు చేరుకుని ఉల్లాళ సమీపంలోని ఎంవీ. లేఔట్ లో అద్దె ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టాడు. అత్తమామలతో పాటు అందరికి దూరంగా వచ్చినా కవన మాత్రం ఆమె కోరికలు తగ్గించుకోలేదు. ప్రతిరోజు భర్త మహేశ్వర్ కు ఏదో ఒకటి కావాలని కవన టార్చర్ పెట్టింది.

ఆత్మహత్య చేసుకున్న భర్త
తనకు బంగారు నగలు కావాలని, మా నాన్న వ్యాపారం చేసుకోవడానికి రూ. 4 లక్షలు ఇవ్వాలని కవన ఆమె భర్త మహేశ్వర్ ను టార్చర్ పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు వచ్చిన తరువాత ఎలా బతకాలి అని ఆలోచిస్తున్న మహేశ్వర్ అతని భార్య కవన టార్చర్ తట్టుకోలేకపోయాడు. ఇలాంటి భార్యతో జీవితాంతం కలసి జీవించలేనని మహేశ్వర్ అనుకున్నాడు.

మూడు నెలలకే జీవితం ముగిసిపోయింది
భార్య కవనకు చాలాసార్లు నచ్చచెప్పడానికి మహేశ్వర్ ప్రయత్నించాడు. అయితే కవన మాత్రం ఎవ్వరిమాట వినకపోవడంతో మహేశ్వర్ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. భార్య కవన కోరుతు విలాసవంతమైన జీవితం అందించలేనని మహేశ్వర్ డిసైడ్ అయ్యాడు. ఇంటిలో మహేశ్వర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫ్యామిలీ ప్యాకేజ్ టార్చర్
తన కొడుకు మహేశ్వర్ ఆత్మహత్యకు మా కోడలు కవన, అమె తల్లిదండ్రులు ఆత్మానంద, పద్మా టార్చర్ పెట్టడమే ప్రధాన కారణం అని. మాకొడుకు మహేశ్వర్ కు ఎలాంటి సమస్యలు లేవని, మా కోడలు, ఆమె కుటుంబ సభ్యులు నిత్యం మహేశ్వర్ ను వేధించారని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో బెంగళూరు పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications