సుప్రీం కోర్టు ఆదేశాలు: పోలీసు కస్టడీకి సుబ్రతా రాయ్

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించడంలో విఫలమైన సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌ను ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సుబ్రతా రాయ్ తరపు న్యాయవాది రాం జెఠ్మాలానీ తెలిపారు. కాగా తన తల్లి అనారోగ్యంగా కారణంగానే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాలేకపోయారని సహారా గ్రూప్ పేర్కొంది.

సహారా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన 20 వేల కోట్ల రూపాయలకు సంబంధించి సెబికి సహారా గ్రూప్‌కు మధ్య నడుస్తున్న కేసులో కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ సుబ్రతా రాయ్ న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంతో బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే ఫిబ్రవరి 24న కోర్టు ముందు హాజరయ్యేందుకు తాను ఢిల్లీకి వచ్చానని.. అయితే తన తల్లి ఆరోగ్యం విషమించిందని సమాచారం అందడంతో తిరిగి లక్నోకు వెళ్లానని సుబ్రతారాయ్ పేర్కొన్నారు.

Sahara chief Subrata Roy taken into custody by Lucknow police

అరెస్ట్‌కు ముందు ఆయన మాట్లాడుతూ.. తాను ఎక్కడికి పారిపోలేదని, సుప్రీం ఆదేశాలను బే షరతుగా పాటిస్తానని పేర్కొన్నారు. అయన్ను అరెస్టు చేసేందుకు గురువారంనాడు కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు లక్నోలోని సుబ్రతా రాయ్ ఇంటికి వెళ్లారు. అయితే ఆయన వారికి దొరకలేదు. అయితే తాను మాత్రం లక్నోలోనే ఉన్నానని సుబ్రతా రాయ్ తెలిపారు. తాను తన తల్లి ఆరోగ్యం విషయంలో వైద్యుల బృందాన్ని కలిసేందుకు వెళ్లానని చెప్పారు.

పోలీసులకు తమ విధులు నిర్వర్తించుకోవచ్చునని తాను ఇప్పటికే చెప్పానని సుబ్రతారాయ్ పేర్కొన్నారు
సుప్రీం కోర్టు అనుమతిస్తే మార్చి 3 వరకు అనారోగ్యంగా ఉన్న తన తల్లి వెంట ఉంటానని ఆయన వివరించారు. మార్చి 4న కోర్టు ఎదుట హాజరయ్యేందుకు తన పిటిషన్‌లో సంసిద్ధత తెలిపారు. బుధవారం కోర్టుకు గైర్హాజరుకావడంపై కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+