సైఫ్‌పై దాడి.. నిర్ధోషిగా తేలిన తొలి అనుమానితుడి జీవితం నాశనం!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై కత్తితో దాడి చేసిన కేసులో మొదట ఆకాశ్ కైలాష్ కనోజియా అనే యువకుడ్ని అనుమానితుడిగా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో రైలులో ప్రయాణం చేస్తుండగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, విచారణలో అసలు నిందితుడు కాదని తేలడంతో పోలీసులు అతడ్ని వదిలిపెట్టారు. అయితే, అప్పటికే ఆ యువకుడి జీవితంలో ఊహంచని నష్టం జరిగిపోయింది.
తనను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందని 31 ఏళ్ల ఆకాశ్ కైలాష్ కనోజియా ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తన డ్రైవర్ ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతోపాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని కనోజియా వాపోయాడు.

ఆ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అన్ని మీడియాల్లో నా ఫొటోలు వచ్చాయి. అవి చూసిన మా కుటుంబం షాక్‌కు గురైంది. కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో దుర్గ్‌లో నన్ను అరెస్ట్ చేసి రాయ్‌పూర్‌కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబై పోలీసు బృందం నాపై దాడి చేసింది ని ఆకాశ్ కనోజియా ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను నిందితుడిని కాదు అని తెలియడంతో పోలీసులు విడిచిపెట్టారని తెలిపారు. అయితే, పోలీసులు అరెస్ట్ చేశారనే కారణంతో తాను తన ఉద్యోగం కోల్పోయినట్లు తెలిపాడు. అంతేగాక, తనతో వివాహం వద్దని అమ్మాయి తరపు కుటుంబీకులు నిశ్చయించకున్నారని వాపోయాడు. అయితే, తనపై కఫ్ రేడ్, గుర్గావ్‌లో రెండు కేసులు ఉన్న మాట నిజమేనని తెలిపాడు. ముంబై పోలీసులు చేసిన తప్పిదం కారణంగా తన జీవితం సర్వనాశనం అయ్యిందని ఆకాశ్ కనోజియా వాపోయాడు.
తనకు మీసాలు ఉన్నాయని.. సైఫ్ ఇంట్లోని సీసీటీవీలో కనిపించిన వ్యక్తికి లేవనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తించలేకపోయారని చెప్పాడు. కొన్ని గంటల్లోనే అసలు నిందితుడు దొరికాడని, లేదంటే ఈ కేసులో తాను ఇరుక్కునేవాడినని పేర్కొన్నాడు. తనకు జరిగిన అన్యాయంపై సైఫ్ ఇంటి ముందు నిల్చుని ఉద్యోగం కోసం వేడుకోవాలని యోచిస్తున్నట్లు కనోజియా చెప్పుకొచ్చాడు.
కాగా, కనోజియాను అరెస్టు చేసిన మరుసటి రోజే బంగ్లాదేశ్‌కు చెందిన షరిపుల్ ఇస్లామ్ షెహజాద్ మొహమ్మద్ (విజయ్ దాస్ అని తన పేరును చెప్పుకుంటున్నాడు) అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. అసలు నిందితుడు ఇతడే అని నిర్ధారించిన పోలీసులు.. ఆకాశ్ కనోజియాను విడిచిపెట్టారు. అయితే, ఈ క్రమంలోనే కనోజియా ఉద్యోగం పోవడంతోపాటు పెళ్లి కూడా రద్దవడం అతనికి తీరని నష్టాన్ని కలిగించినట్లయింది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications