Salam: మదరసాలో క్రైస్తవ ప్రార్థనలు, ఎవరిది ఏ కులం ?, చేతులు ఎత్తేసిన బంధువులు, దేశానికి ఆదర్శం !

కొచ్చి/ తిరువనంతపురం/ కేరళ: నీది ఆ కులం... నాది ఈ కులం, నీది ఆ మతం, నాది ఈ మతం అంటూ ప్రతిరోజూ చాలా మంది కొట్టుకుని చస్తున్నారు. ఎవ్వరూ లేని అనాథలాగా మరణించిన బామ్మకు మేము ఉన్నాము అంటూ మరో మతం మహిళలు, విద్యార్థులు ముందుకు వచ్చారు. ముస్లీంలు ఎంతో పవిత్రంగా చూసుకునే మదరసాలో క్రిస్టియన్ మతానికి చెందిన బామ్మ మృతదేహం పెట్టి క్రైస్తవ సాంప్రధాయం ప్రకారం ప్రార్థనలు చేసి ఆమె చివరి కోరిక ప్రకారం అత్యక్రియలు సజవుగా సాగేలా చేసిన ముస్లీంలు నేడు దేశానికి ఆదర్శంగా నిలిచారు.

 ఆసుపత్రిలో జీవితాంతం బామ్మ సేవలు

ఆసుపత్రిలో జీవితాంతం బామ్మ సేవలు

కేరళలోని కోజికోడ్ లో బ్రిడ్జేట్ రిచర్డ్ (84), ఆమె భర్త రిచర్డ్ దంపతులు నివాసం ఉండేవారు. బ్రిడ్జేట్, రిచర్డ్ దంపతులు పిల్లలు లేరు. మల్లప్పురంలోని మంజేరిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో బ్రిడ్జేట్ ఆమెకు ఓపిక ఉన్నంతవరకు సేవలు అందించారు. తరువాత బ్రిడ్జేట్ రిటైడ్ అయ్యారు.

 సొంత ఇంటిలో కాపురం

సొంత ఇంటిలో కాపురం

రిటైడ్ అయిన తరువాత బ్రిడ్జేట్ మలప్పురం జిల్లాలోని కొండోట్టికి సమీపంలోని పొన్నాట్టు ప్రాంతంలో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. భర్త రిచర్డ్ తో కలిసి అదే ఇంటిలో బ్రిడ్జేట్ 13 ఏళ్ల పాటు ఆమె నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం రిచర్డ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి బ్రిడ్జేట్ ఒంటరిగా అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

 దేవుడు కరుణించలేదు

దేవుడు కరుణించలేదు

కొంతకాలంగా బ్రిడ్జేట్ కూడా అనారోగ్యానికి గురైనారు. అప్పటి నుంచి కోజికోడ్ లోని ఓ ఆసుపత్రిలో బ్రిడ్జేట్ కు చికిత్స అందించారు. బ్రిడ్జేట్ ప్రాణాలు రక్షించడానికి వైద్యులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే దేవుడు కరణించకపోవడంతో బ్రిడ్జేట్ కన్నుమూశారు. బ్రిడ్జేట్ అంత్యక్రియలు చెయ్యడానికి ఆమెకు పిల్లలు లేరు. సొంత బంధువులు కూడా అంత్యక్రియలు చెయ్యడానికి ముందుకురాలేదు.

 చిన్న వీధులు..... అవకాశం లేదు

చిన్న వీధులు..... అవకాశం లేదు

బ్రిడ్జేట్ మృతదేహం ఐస్ బాక్స్ లో పెట్టి ఆమె సొంత ఇంటికి తీసుకెళ్లడానికి ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించారు. అయితే బ్రిడ్జేట్ నివాసం ఉంటున్న సొంత ఇంటి దగ్గర ఉన్న వీధులు చాల చిన్నవిగా, ఇరుకుఇరుకుగా ఉండటంతో ఐస్ బ్యాక్స్ ను ఆమె ఇంటిలోకి తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. అలాగే శవాన్ని మళ్లీ ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లాలి అంటూ ఆసుపత్రి సిబ్బంది ఆలోచనలో పడ్డారు.

 మదరసాలో క్రైస్తవ ప్రార్థనలు

మదరసాలో క్రైస్తవ ప్రార్థనలు

బ్రిడ్జేట్ ఇంటి సమీపంలో అరబిక్ మదరసా పాఠశాల ఉంది. అరబిక్ పాఠశాలలో 500 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అన్ని తరగతుల్లో పిల్లలు ఉండటంతో ఓ గది మాత్రం ఖాళీగా ఉంది. మదరసాలోని ముస్లీం పెద్దలు బ్రిడ్జేట్ మృతదేహం ఆ పాఠశాల గదిలో పెట్టాలని సూచించారు. మదరసాలోని పాఠశాలలోని గదిలో బ్రిడ్జేట్ మృతదేహం పెట్టి క్రైస్తవ సాంప్రధాయం ప్రకారం ప్రార్థనలు చేశారు.

Recommended Video

    Hasina Begum Returns Home after 18 years in Pak jail 18 ఏళ్ళ తర్వాత భారత్ చేరుకున్న మహిళ
     సలామ్ సోదరులారా

    సలామ్ సోదరులారా

    బ్రిడ్జేట్ చివరి కోరిక ప్రకారం క్రైస్తవ సాంప్రధాయం ప్రకారం కోజికోడ్ లోని వెస్ట్ గిల్ క్రిస్టియన్ స్మశానవాటిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కులమతాల కోసం కొట్టుకుంటున్న సమయంలో క్రైస్తవ మతానికి చెందిన బామ్మకు మదరసాలో ప్రార్థనలు నిర్వహించి ముందుండి ఆమె అంత్యక్రియలు నిర్వహించిన ముస్లీం సోదరులు, మదరసా విద్యార్థులు నేడు దేశానికి ఆదర్శంగా నిలిచారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+