పద్మశ్రీని తిరస్కరించిన సల్మాన్ ఖాన్ తండ్రి

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించేందుకు బాలీవుడ్ రచయిత, నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తిరస్కరించారు. తన హోదాకు, చేస్తున్న పనికి ఆ అవార్డు సరిపోదని అన్నారు.

ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నన్ను నిర్లక్ష్యం చేసిందని వాపోయారు. సనీ పరిశ్రమలో నా సహచరులు, నాకన్నా జూనియర్‌లను పద్మ పురస్కారంతో గౌరవించిందన్నారు.

Salim Khan declines to receive Padma Shri

పద్మ అవార్డుల జాబితాలో నా పేరు ఉందని నాకు మూడు రోజుల క్రితమే తెలిసింది. అప్పుడే అనుకున్నా నేను పొందాల్సిన దాని ఎట్టకేలకు సాధించానని అన్నారు. కానీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నన్ను పద్మశ్రీకి ఎంపిక చేసిందని తెలియగానే అతి నాకు తగింది కాదని భావించానని చెప్పారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తనను గుర్తించి అవార్డు ప్రకటించింనందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తనను పక్కనబెట్టిందని ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. తనకున్న హోదాకు పద్మశ్రీ ఆలస్యంగా వస్తే ఎవరైనా స్వీకరిస్తారా చెప్పండంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. 79 ఏళ్ల సలీం ఖాన్ బాలీవుడ్‌లో చాలా సినిమాలకు రచయితగా, నిర్మాతగా పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+