వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో పతంగి ఎగరేసిన సల్మాన్: ఓటైతే ప్రియాదత్‌కే

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో కలిసి పతంగి ఎగురేశారు. మోడీని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. గొప్ప వ్యక్తిగా, మంచి వ్యక్తిగా సల్మాన్ మోడీని అభివర్ణించారు. గుజరాత్ అభివృద్ధికి మురిసిపోయారు.

మోడీ ప్రధాని కావాలని కూడా ఆయన ఆశించారు. మోడీతో కలిసి సల్మాన్ లంచ్ చేశారు. సల్మాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలపై నరేంద్ర మోడీ నాలుగు ట్వీట్లు చేశారు. రెండు ఫొటోలను షేర్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు మోడీతో సల్మాన్ ఖాన్ ఉన్నారు

జై హో చిత్రం ప్రమోషన్ కోసం వచ్చిన సల్మాన్ ఖాన్ అంతర్జాతీయ పతంగుల ఉత్సవంలో పతంగి ఎగురేశారు. మోడీ కూడా పతంగులు ఎగరేశారు. ఇద్దరు కలిసి ఉత్సవంలో పాల్గొనడంతో సల్మాన్ ఖాన్ మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని భావించారు.

ప్రతి నియోజకవర్గంలో ప్రజలు మంచి అభ్యర్థికి ఓటేయాలని సల్మాన్ ఖాన్ అన్నారు. భారత్, ఇండియాకు మంచి వ్యక్తి ప్రధాని కావాలని, మోడీ అందుకు తగినవారని ఆయన అన్నారు. అయితే తాను మాత్రం శాసనసభకు బాబా సిద్ధిఖికి, పార్లమెంటుకు ప్రియాదత్‌కు ఓటేస్తానని సల్మాన్ ఖాన్ చెప్పారు. వారిద్దరు కాంగ్రెసువారు కావడం విశేషం.

తన తండ్రి బాలీవుడ్ రచయిత సలీం ఖాన్ మోడీతో తరుచుగా మాట్లాడేవారని ఆయన చెప్పారు. తొలిసారి తాను మోడీని కలిశానని, ఈ కలయికలు పెరుగతాయని భావిస్తున్నానని సల్మాన్ ఖాన్ అన్నారు.

ఉత్తరాయణం సందర్భంగా ఇలా..

ఉత్తరాయణం సందర్భంగా ఇలా..

మంగళవారం జరిగిన గాలిపటాల ఉత్సవంలో పాల్గొన్న తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నరేంద్ర మోడీతో ఇలా..

గాలిపటాల ఉత్సవంలో మోడీ

గాలిపటాల ఉత్సవంలో మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సోమవారం గాలిపటాల ఉత్సవం సందర్బంగా అహ్మదాబాద్‌లో ఇలా ప్రసంగిస్తూ కనిపించారు.

అహ్మదాబాద్‌లో ఇలా..

అహ్మదాబాద్‌లో ఇలా..

మూడు రోజుల గాలిపటాల ఉత్సవంలో అహ్మదాబాద్‌లో ప్రజలు ఇలా ఉత్సాహంగా కనిపించారు. గాలిపటాలు ఎగురేస్తూ సంబరాలు చేసుకున్నారు.

గాలిపటం ఎగురేస్తూ నరేంద్ర మోడీ..

గాలిపటం ఎగురేస్తూ నరేంద్ర మోడీ..

అహ్మదాబాద్‌లో గాలి పటాల ఉత్సవంలో సోమవారంనాడు పతంగిని ఎగురేస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇలా కనిపించారు.

గాలిపటాల ఉత్సవంలో..

గాలిపటాల ఉత్సవంలో..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అహ్మదాబాద్‌లో జరిగిన గాలిపటాల ఉత్సవంలో పతంగి ఎగురేయడానికి ప్రయత్నిస్తుండగా నరేంద్ర మోడీ చూస్తూ కనిపించారు.

English summary
Salman Khan on Tuesday called Narendra Modi "a good man", even "a great man", and acknowledged his development work in Gujarat while giving him his "best wishes".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X