సల్మాన్ ఖాన్ ఉద్వేగం: మందేసింది ఎవరో! ట్వీట్ల జోరు
ముంబై: ఒకరి ప్రాణాలు బలిగొని, నలుగుర్ని గాయపరిచిన హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మే 6, 2015న తీర్పు ఇచ్చింది. అయితే, హైకోర్టు సల్మాన్ ఖాన్‌ను గురువారం నిర్దోషిగా ప్రకటించింది.
సరైన సాక్ష్యాలు లేనందున సల్మాన్‌ను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. సల్మాన్ ఖాన్ తాగి కారు నడిపాడనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందువల్ల ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్ధారించలేమని కోర్టు వెల్లడించింది. సల్మాన్‌పై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తీర్పునిచ్చింది.

పదమూడు సంవత్సరాల నాటి కేసులో నిర్దోషిగా బయటపడినందున సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. మధ్యాహ్నం నుంచి కోర్టు హాల్లో, తన కుటుంబ సభ్యులతో కలసి కూర్చుని ఉన్న సల్మాన్ గంభీరంగా కనిపించాడు. జడ్జి తీర్పు వెలువరించిన అనంతరం ఆయన బంధువులు ఒక్కసారిగా చుట్టుముట్టగా, సల్మాన్ కంట నీరు ఉబికి వచ్చింది.
మరోవైపు, సల్మాన్ ఖాన్‌ను న్యాయస్థానం నిర్దోషిగా తీర్పు చెప్పడంతో సామాజిక అనుసంధాన వేదికల్లో పలువురు స్పందిస్తున్నారు. సల్మాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు కోర్టు తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Finally we know ! The car was drunk .
#SalmanVerdict
— Anjana Om Kashyap (@anjanaomkashyap) December 10, 2015 #SalmanVerdict has given me faith in Indian judiciary. ROFLOLOLHAHA *Applies for more loan*
— Vijay Mallya (@thevijaymalllya) December 10, 2015 సల్మాన్ ఖాన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు చాలామంది అభినందనలు తెలుపుతున్నారు. మరికొందరు సెటైర్లు రాస్తున్నారు. 'అంతిమంగా మనకు తెలిసింది..! కారు తాగి ఉంది (మందు)' అని, 'ఇది బాధాకరమైన రోజు' అని ఇంకొందరు పేర్కొన్నారు.
Mubarak to all Bros Fans!! They Love Salman Bro to death and always stand by him! He has BIGGEST & Strongest Fan Base ever👍😍
#SalmanVerdict
— SalmanKhanLicious (@SalluLicious) December 10, 2015 😂😂 Congo Salman bhaii :P Happy 4 ur Family ....... #SalmanVerdict https://t.co/dGzNnqShVD
— Vishnu ᴰᶦᶫʷᵃᶫᵉ (@RoyalViraTian) December 10, 2015 -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications