బీజేపీ చేతికి చిక్కిన సల్మాన్ - ఇక ఆట మొదలు: రాజా సింగ్ ఎపిసోడ్‌తో..!!
ముంబై: మునావర్ ఫారూఖీ.. కొద్దిరోజుల కిందట రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపించిన పేరు. ఈ స్టాండప్ కమేడియన్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారానికి కారణమైంది. భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ అరెస్టుకు దారి తీసిన పేరు కూడా ఇదే. హిందూ దేవుళ్లను కించపరిచిన మునావర్ ఫారూఖీ నిర్వహించ తలపెట్టిన షోనకు అనుమతి ఇవ్వొద్దంటూ తెలంగాణ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు.
బిగ్‌బాస్‌లో మునావర్..
ఇప్పుడు తాజాగా మునావర్ ఫారూఖీ మళ్లీ వార్తలోకి ఎక్కాడు. ఇప్పుడాయన ఏకంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. హిందీలో త్వరలో ప్రసారం కాబోతోన్న బిగ్‌బాస్ సీజన్ 16లో కనిపించనున్నాడు. టైటిల్ కాంటెస్టెంట్‌గా పోటీ పడనున్నాడు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న బిగ్గెస్ట్ టీవీ రియాలిటీ షో ఇది. ఇప్పటివరకు 15 సీజన్లను పూర్తి చేసుకుంది. 16వ సీజన్ త్వరలో వీక్షకులను పలకరించబోతోంది.

ప్రొమో అవుట్..
దీనికి సంబంధించిన ప్రొమో అవుట్ అయింది. దీన్ని సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. కలర్స్ టీవీలో ఇది టెలికాస్ట్ కానుంది. ఈ ప్రొమోను ఆసక్తికరంగా కట్ చేశారు నిర్వాహకులు. 15 సీజన్లకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్‌ను యాడ్ చేశారు. అనంతరం ఈ ఫ్రెష్ సీజన్‌లోని కొన్ని సన్నివేశాలు దీనికి జత చేశారు. సల్లూ భాయ్ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుందీ ప్రొమో. ఈ 15 సంవత్సరాల్లో అందరూ తమ తమ గేమ్స్ ఆడారు.. ఈ సారి బిగ్‌బాస్ వంతు వచ్చింది. కలర్స్ టీవీలో త్వరలో బిగ్‌బాస్ 16 రాబోతోంది.. అంటూ హింట్ ఇచ్చారు సల్మాన్.

మునావర్‌తో పాటు..
మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. బిగ్‌బాస్ ఓటీటీ టైటిల్ విన్నర్ దివ్య అగర్వాల్, స్టాండప్ కమేడియన్, లాకప్ సీజన్ 1 టైటిల్ విజేత మునావర్ ఫారూఖీ, టీవీ నటి కనిక మాన్, నాగిన్ ఫేమ్ తేజస్వి ప్రకాష్ ఆమె ప్రియుడు, నటుడు, టీవీ హోస్ట్ కరణ్ కుంద్రా, సింబా నాగ్‌పాల్, షమిత షెట్టి, ప్రతీక్ షెహజ్‌పల్, నిషాంత్ భట్, ఆకాశ సింగ్, విశాల్ కొటియాన్, దోనల్ భిష్త్, టీవీ షో ఇమ్లీ ఫేమ్ ఫహ్మాన్ ఖాన్, సుంబుల్ తౌకీర్ ఖాన్ సెలెక్ట్ అయ్యారు. మరిన్ని పేర్లు తెలియాల్సి ఉంది.

సల్లూ భాయ్ టార్గెట్..?
మునావర్ ఫారూఖీ బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ కావడం దాదాపు ఖాయం కావడంతో దీనిపై బీజేపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక వారు సల్మాన్ ఖాన్‌ను టార్గెట్‌గా చేసుకుని ఎంత వరకు విమర్శలు సంధించగలుగుతారనేది ఆసక్తి రేపుతోంది. కిందటివారమే తెలుగులో ఆరంభమైన బిగ్ బాస్ సీజన్ 6పై ఎప్పట్లాగే విమర్శలు ఎదురవుతున్నాయి. సీపీఐ సీనియర్ నేత నారాయణ తనదైన తరహాలో ఆరోపణలు గుప్పించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications